సినిమా

Varanasi: ఇంకా పూర్తి చేయాల్సింది మిగిలే ఉంది!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమాకి సంబందించి దర్శకుడు రాజమౌళి విదేశాలలో పలు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ముందు అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ, వ్యాపారపరంగా వారణాసి నుంచి ఏ డీల్ కూడా క్లోజ్ కాలేదు. అయితే, తాజా సమాచారం మేరకు ఇంకో 10 రోజుల పాటు షూట్ బ్యాలెన్స్ ఉంది.

ఇంకా 10 రోజుల షూట్‌లో ఏం చేయనున్నారు:

రాజమౌళి సినిమా అంటే ప్రతీ ఫ్రేము ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటిది, హీరో ఎంట్రీ సీన్ ఎలా ప్లాన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి, ఉదాహరణ బాహుబలి పార్ట్ 1లో ప్రభాస్ ఎంట్రీ గుర్తు చేసుకోవచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చి భుజాన పెట్టుకున్న శివ లింగంతో నీళ్లలో దూకుతాడు. ఆ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. అలాగే, బాహుబలి 2లోనూ పెద్ద డోర్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చి ఏనుగును గుద్దే సీన్‌తో ఎంట్రీ.

ఈ రేంజ్‌లో హీరోల ఎంట్రీ ప్లాన్ చేసే రాజమౌళి..ఇప్పుడు వారణాసి సినిమా కోసం భారీ స్థాయిలో మహేష్ బాబు ఎంట్రీ సీన్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఎంట్రీ సీన్ కోసం 10 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఇదొక్కటే బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పార్ట్. దీంతో, మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఆ మధ్య వారణాసి సినిమాకి సంబందించిన షూట్ మొత్తం పూర్తి చేసి మహేష్ విదేశాలకి వెళ్ళారని వార్తల్లో వచ్చింది. కానీ, అది నిజం కాదు. స్వయంగా రాజమౌళినే ఈ పదిరోజుల షూట్..మహేష్ ఎంట్రీ గురించి వెల్లడించాడు.

కాగా, ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందానికి పాత్రలో నటిస్తోంది. అలాగే, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైథలాజికల్, పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న వారణాసిలో మహేష్-ప్రియాంకల మధ్య ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతోంది. ఇక, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్ కాబోతోంది.

#Varanasi#SS.Rajamouli#Super Star Maheash Babu#Priyanka Chopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి