Nidhhi Agerwal: యాక్టింగ్ రాదు, ఎక్స్ప్రెషన్స్ లేవు అన్న మాట నిధి అగర్వాల్ విషయంలో వినిపించింది. పక్కా హైదరాబాదీ అయిన నిధి..ముందు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ బ్యూటీ కెరీర్లో బ్లాక్ బస్టర్ అంటే ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే. దాదాపు, అందరు ఈమెను ఫ్లాప్ హీరోయిన్ అనే కామెంట్స్ చేశారు. కానీ, ఈ ఫ్లాప్ హీరోయిన్ చేతిలో ఏకంగా అరడజను సినిమాలుండటం షాకింగ్ విషయం.
'ది రాజాసాబ్' ఫ్లాప్ తర్వాత కనిపించని నిధి:
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అయితే, ఈ సినిమా తర్వాత.. ఇందులో నటించిన ముగ్గురు హీరోయిన్స్ మళ్ళీ కొత్త సినిమా కబురేది చెప్పలేదు. ముఖ్యంగా, మన హైదరాబాదీ అమ్మాయి నిధి అగర్వాల్ ఇక ఫేడవుట్ అయినట్టే అనుకున్నారు. కానీ, ఈ ఇస్మార్ట్ బ్యూటీ చేతిలో ఏకంగా 6 చిత్రాలున్నాయి. రానున్న రెండేళ్ళ ఈ 6 సినిమాలతో సందడి చేయనుంది.
హిందీలో 3 చిత్రాలు..
నిధి అగర్వాల్ హిందీమలో మూడు విభిన్నమైన కథా-కథనాలతో రూపొందుతోన్న భారీ చిత్రాలకు సంతకం చేసింది. ఇప్పటికే, మూడు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాదు, కోలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్. ఇంతకముందు, ఆమె తమిళంలో 'ఈశ్వరన్', 'భూమి', 'కలగ తలైవన్' అనే సినిమాలలో నటించి నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం, ఈ ఇస్మార్ట్ బ్యూటీ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సొంత బ్యానర్ 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీలో నటిస్తోంది.
తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్:
ది రాజాసాబ్ తర్వాత కూడా రెండు సినిమాలను చేస్తున్నట్టుగా అప్పట్లోనే నిధి చెప్పింది. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దాంతో, తెలుగు ఇండస్ట్రీ నుంచి నిధిని పక్కన పెట్టారేమో! అన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం అఫీషియల్‌గా రెండు చిత్రాలో హీరోయిన్గా నటిస్తోంది. వీటిలో ఒక సినిమా యంగ్ హీరోతో కాగా, ఇంకోటి మాత్రం ఫీమేల్ సెంట్రిక్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్నారు. సో ఈ రకంగా నిధి అగర్వాల్ క్రేజీ లైనప్‌తో రానున్న రెండేళ్ళు చాలా బిజీ.


