క్రైమ్

Crime : భర్త చేసిన తప్పుకు బలైన భార్యా పిల్లలు!

4 నిమిషాల పఠనం

భర్త చేసిన తప్పుకు భార్యా పిల్లలు బలయ్యారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.ఇంతకూ ఆ భర్త ఏం చేశాడు? అతని భార్య ఏం చేసింది? పిల్లలతో కలిసి ఏం చేసింది? చివరకు ఈ ఘటన తీవ్ర విషాదంగా ఎలా మిగిల్చింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భర్త చేసిన తప్పుకు భార్యా పిల్లలు బలయ్యారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.ఇంతకూ ఆ భర్త ఏం చేశాడు? అతని భార్య ఏం చేసింది? పిల్లలతో కలిసి ఏం చేసింది? చివరకు ఈ ఘటన తీవ్ర విషాదంగా ఎలా మిగిల్చింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆవేదనతో ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకివెళితే.. వరంగల్ జిల్లా ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ అనే వ్యక్తి.. హన్మకొండ జిల్లా బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన మమత (30) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సుమన్ ఊరిలో కూలీ పనులు చేస్తుండగా.. మమత నర్సంపేటలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు హరిణి (4), కావ్యశ్రీ (3). ఈ క్రమంలోనే సుమన్.. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 20 రోజుల క్రితం ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. విషయం తెలిసి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, సుమన్ తన భార్యతోనే ఉండాలని తీర్మానించారు. కొన్ని రోజులుగా నర్సంపేట మండలం ముగ్ధుంపురంలోని బంధువుల ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు.

అయితే, సుమన్ మరోసారి సదరు వివాహితతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విసుగు చెందిన అతని భార్య మమత తిరిగి ఎలుకుర్తి హవేలీకి వచ్చేసింది.ఇదిలాఉండగా, సుమన్ ఎవరితో అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆ మహిళ తన బంధువులతో కలిసి మమత ఇంటికి వెళ్లి తీవ్రంగా దూషించినట్టు సమాచారం. దీంతో అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి పిల్లలతో సహా బయలుదేరిన మమత.. పాకాల చెరువు వద్దకు చేరుకుని, హైదరాబాద్‌లో ఉండే బంధువులకు చనిపోతున్నానని చెప్పి లొకేషన్ షేర్ చేసింది.

అనంతరం పిల్లలను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకింది. బంధువులు మమత ఫోన్‌కు పదే పదే కాల్ చేయడంతో చెరువు వద్ద సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేశారు. వారికి బాధితురాలి బంధువులు అసలు విషయం చెప్పారు. దీంతో చెరువులో గాలించి ముగ్గురి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు.

కూతురు, మనవరాళ్లు చనిపోయారని తెలిసినా మమత తల్లిదండ్రులు అక్కడికి రాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని ఆమె పేరెంట్స్ సైతం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

#husband mistake#extramarrital affair#wife suicide with childrends#Crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి