Bollywood: గత కొంతకాలంగా రకుల్ ప్రీత్‌సింగ్ సౌత్‌లో మరీ ముఖ్యంగా మన టాలీవుడ్‌లో కనిపించడం లేదు. చెక్, కొండపొలం సినిమాలు డిజాస్టర్ తర్వాత మళ్ళీ, తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కలేదు. బాలీవుడ్‌లో అడపాదడపా చేస్తోంది. దీంతో, దాదాపుగా రకుల్ ప్రీత్‌సింగ్ ఫేడవుట్ అయిందని మాట్లాడుకున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశమే రామాయణ సినిమాలో శూర్పణఖ పాత్ర. సాలీడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, తాను పోషించిన ఈ పాత్రకి ప్రశంసలు అందుకుంటోంది.
నితీశ్ తివారీ తెరకెక్కించిన భారీ చిత్రం 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన రామాయణ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. సాధారణంగా శూర్పణఖ పాత్ర అనగానే ప్రేక్షకులకు కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలే గుర్తుకొస్తాయి. కానీ, ఈ సినిమాలో ఆ పాత్రలోని విభిన్న కోణాలను చూపించే ప్రయత్నం చేశారు. రకుల్ కూడా తన అద్భుతమైన నటనతో ఈ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
ముఖ్యంగా.. ఆమె లుక్, హావభావాలు, తెరపై కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రతో గుర్తుండిపోయే ప్రభావాన్ని చూపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రకుల్ ఈ శూర్పణఖ పాత్రను అంగీకరించడానికి ప్రధాన కారణం అందులోని సంక్లిష్టతేనని గతంలో వెల్లడించింది. చరిత్రలో శూర్పణఖను ఒక సంఘటనతోనే గుర్తుంచుకుంటారని, అయితే.. ఆమె కథలో అంతకంటే ఎక్కువ కోణాలు ఉన్నాయని చెప్పింది. నటిగా తనను సవాలు చేసే పాత్రలు చేయడం ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల పీటీఐతో మాట్లాడిన సందర్భంగా కూడా శూర్పణఖ చాలా అపార్థం చేసుకున్న, అనేక కోణాలున్న పాత్ర అని రకుల్ వివరించింది. ఈ పాత్రను పోషించడం తనకు గొప్ప అనుభవమని తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఈ సినిమా రకుల్ కి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా, రెండవ భాగం కూడా ఉండటంతో..ఈ పాత్ర ఎస్టాబ్లిష్‌మెంట్, నిడివి ఇంకా ఎక్కువగా ఉండబోతుందని సమాచారం. మరో, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పోషించిన మండోదరి పాత్రపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా అసంతృప్తి ఉంది.


