Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్ 100. ఇది నాగార్జున 100వ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ యువ దర్శకుడు రా. కార్తీక్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌తో చిత్రబృందం దీపావళి పండుగ సందర్భంగా సర్‌ప్రైజ్ చేసింది. తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ముఖ్యంగా. అశోక్ సెల్వన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయడం విశేషం. ఇందులో ఆయన కర్ణ అనే పాత్రలో కనిపించనున్నారు. జైలు నేపథ్యంలో విడుదలైన ఈ పోస్టర్‌లో ఆయన లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. పోలీస్ యూనిఫామ్‌ను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా కూర్చున్న ఆయన తీరు పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
విలన్‌గా అశోక్ సెల్వన్!
ఇన్నిరోజులు కింగ్ 100 లో మేయిన్ విలన్ ఎవరనే తమిళంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ సెల్వన్.. ఇప్పుడు నాగార్జునతో తలపడబోతున్నారు. ఈ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా, ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కర్ణ పాత్రలో ఆయన చూపించబోయే మ్యాడ్‌నెస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇక, ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కలిసి తెరపై కనిపించబోతుండటం మరో ప్రత్యేకత. మహంతి ఝాన్సీ రాణి అనే పవర్‌ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఐశ్వర్య రాజేష్, సుస్మిత భట్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా, ఈ డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.


