తెలంగాణ

TG : ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు.. చివరకు!

4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే.అయితే, ఇళ్లు నిర్మాణం కోసం ఒకేసారి డబ్బులు ఇవ్వకుండా విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాలో డబ్బులు వేస్తోంది. ఆ డబ్బులు కూడా సరిపోక కొందరు అప్పులు చేసి మరీ ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే.అయితే, ఇళ్లు నిర్మాణం కోసం ఒకేసారి డబ్బులు ఇవ్వకుండా విడతల వారీగా ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాలో డబ్బులు వేస్తోంది. ఆ డబ్బులు కూడా సరిపోక కొందరు అప్పులు చేసి మరీ ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకుంటున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొందరు అధికారులు, స్థానిక లీడర్ల అత్యుత్సాహం కారణంగా లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. ఆమె స్థలం కాస్త రోడ్డుకు ఆనుకుని ఉన్నట్టు సమాచారం. అయితే,ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆశతో అప్పులు చేసి మరి సదరు మహిళ ఇల్లు నిర్మించుకుంది. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక రోడ్డుపైకి మెట్లు వచ్చాయంటూ అధికారులు వాటిని కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళసంఘం గ్రామంలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన క్యాతం శోభారాణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిధులు విడుదల కావాలంటే ముందుగా ఇల్లు కట్టుకోమని అధికారులు చెప్పారు. దీంతో పాత ఇంటిని కూల్చివేసి మరీ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే, రోడ్డుపై మెట్లు ఉన్నాయంటూ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ భర్త ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు ఇంటి మెట్లను కూల్చివేయించారు. ముందు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చడం ఏంటని బాధిత మహిళా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, అధికారుల తాజాగా చర్యలతో తాము మరిన్ని బాధలు పడాల్సి ఉంటుందని సదరు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్లు నిర్మాణం దశలో సర్పంచ్ భర్తకు, అధికారులకు కళ్లు కనిపించలేదా? నిర్మాణం పూర్తయ్యాక కూల్చే బదులు ముందే అభ్యంతం తెలిపి ఉంటే నిరుపేద మహిళకు ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చేవా? అని పలువురు నెట్టింట మండిపడుతున్నారు.

#indiramma house#poor women#house complete#stairs demolished#sangareddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి