క్రైమ్

Crime : టెకీలకు ఏమైంది? 30వ ఫ్లోర్ పైనుంచి పడి మరొక యువ టెకీ మృతి

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

సాఫ్ట్‌వేర్స్ తయారు చేయాల్సిన టెకీలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకు ఒత్తిడే కారణంగా తెలుస్తోంది.మరికొందరు టెక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, టెక్నాలజీ అప్డేట్స్, ఏఐ, లేఆఫ్స్ కారణంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురువుతున్నట్టు సమాచారం.

సాఫ్ట్‌వేర్స్ తయారు చేయాల్సిన టెకీలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకు ఒత్తిడే కారణంగా తెలుస్తోంది.మరికొందరు టెక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, టెక్నాలజీ అప్డేట్స్, ఏఐ, లేఆఫ్స్ కారణంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురువుతున్నట్టు సమాచారం. వర్క్ ప్రెజర్ కూడా వారిని మానసికంగా కుంగదీస్తుంటున్నట్టు తెలుస్తోంది. మరి కొందరు ఒంటరి తనం భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.

నగరంలో హర్యానాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిన్న హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. 30వ ఫ్లోర్ పై నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న భరత్(29) అనే యువకుడు 30వ ఫ్లోర్ నుంచి పడి అనుమానాస్పద కింద పడిపోయాడు. నేరుగా కారు మీద పడటంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్ర గాయాలతో భరత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న భరత్.. రెండు రోజుల క్రితమే గోల్ఫ్ ఎడ్జ్‌ అపార్ట్‌మెంట్స్‌లో మారినట్టు తెలిసింది. కిశోర్ అనే బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరత్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉండగా, టెక్ ప్రపంచానికి బెంగళూరు తర్వాత గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌లో వరుసగా ఐటీ నిపుణులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. వారి మరణాలకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. ఇటీవల ఒక నివేదిక ప్రకారం ఇండియాలో 2017 నుండి 2025 మధ్య కాలంలో 227 మంది ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. 2026లోనూ పెరిగిన పని ఒత్తిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా వస్తున్న మార్పులు, లేఆఫ్స్ (ఉద్యోగాల కోత) వల్ల మానసిక ఆందోళనకు గురై పలువురు టెక్కీలు బలవన్మరణానికి పాల్పడినట్లు పలు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

#Software enjineer#suicide#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి