స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

నారాయణ.. రంగారెడ్డిని పిప్పి పీల్చేశావు కదయ్యా?

రచన: Swechaanews Chairman••6 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈయన చేసిన భూ క్లియరెన్స్ ఫైల్స్ అమోయ్ కుమార్‌ని మించి పోయాయని తెలుస్తోంది. ములుగు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఇసుక క్వారీల్లో, రవాణలో ఏం చేశారో జనం ఇప్పుడు నెమరు వేసుకుంటున్నారు. విచ్చలవిడితనంతో ఎవరు ఏది చెప్పినా, నో అనకుండా వందల కోట్లు సంపాదించి భూముల ఫైల్స్ క్లియర్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

  • భూములను ఎలానైనా క్లియర్ చేయొచ్చని నేర్పించారు

  • అప్పనంగా రిపోర్టులు రాసి దారదత్తం చేశారు?

  • రెవెన్యూ డెన్ ఆదేశాలతో రోజురోజుకు రెచ్చిపోతున్న లంచావతారులు

  • జాయింట్ సర్వేకు రూ.30లక్షలు డిమాండ్ చేసినా పసిగట్టలేకపోయారా?

  • బదిలీల కోసం కోట్లు కుమ్మరించి డైలీ వసూళ్ల దందా తెలుసుకోలేకపోయారా?

  • అమోయ్‌ని మించి చేస్తున్న తెగింపు పనులతో దొరికేస్తామని భయం పట్టుకుందా?

  • మరో చోటకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నది అసలు విషయాలు పొక్కొద్దనా?

  • రూ.20లక్షల లంచాలతో రెవెన్యూ అధికారులు పట్టుబడటంలో మీ లోపాలపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్,

9848070809.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈయన చేసిన భూ క్లియరెన్స్ ఫైల్స్ అమోయ్ కుమార్‌ని మించి పోయాయని తెలుస్తోంది. ములుగు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఇసుక క్వారీల్లో, రవాణలో ఏం చేశారో జనం ఇప్పుడు నెమరు వేసుకుంటున్నారు. విచ్చలవిడితనంతో ఎవరు ఏది చెప్పినా, నో అనకుండా వందల కోట్లు సంపాదించి భూముల ఫైల్స్ క్లియర్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని ప్రొత్సహించేలా కలెక్టర్ తీరు ఉన్నదని ఎప్పటి నుంచో బలమైన వాదన ఉంది. అందుకు ఈనాడు సర్వేయర్‌తో పాటు ఎమ్మార్వో రూ.20లక్షలతో పట్టుపడిన తీరు జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తింది. బదిలీల్లో ఎన్ని మాయలు జరిగాయో స్వేచ్ఛ న్యూస్ ఆగస్ట్ 7న వార్త ప్రచురించింది. కానీ, కంట్రోల్ దిశగా చర్యలు తీసుకోలేదు. లంచాలను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే చేయాలంటే మీ అనుంగ అనుచరుడు ఓకే అంటేనే అక్కడ ఫైల్ కదులుతుంది? కాస్ట్లీ ఏరియాలో ఒక్క సర్వేకు రూ.50లక్షలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రెండేళ్లు అయినా అలానే ఆ అప్లికేషన్ పెండింగ్‌లో ఉంటోంది. పైసలు ముడితే వెంటనే సర్వేకు వచ్చి రిపోర్టులు ఇస్తున్నారు. అంటే ఇదంతా జిల్లా పెద్దగా మీకు తెలియకుండానే, మీ సేవ ట్రాకింగ్ లేకుండానే సర్వేలు చేస్తున్నారా? రిపోర్టులు ఇస్తున్నారా? అంటే నమ్మకం కలగడం లేదు.

అమోయ్‌ని మించిపోతున్నారని ఆరోపణ

రంగారెడ్డి జిల్లా బంగారు బాతు. రెవెన్యూ ఫైల్స్ క్లియర్ చేస్తే వందల కోట్లు వచ్చి పడతాయి. అందుకు భూధాన్ భూములు క్లియర్ చేసి ఈడీ కేసులు అయిన అమోయ్ కుమార్ ఉదాహరణ. ఇలానే ఆ తర్వాత వచ్చిన కలెక్టర్స్ ఏం చేశారో అందరం చూశాం. ఓ మహిళా కలెక్టర్ జీవో 59పై చేసిన తతంగం ఇప్పటికి గుర్తుంది. ఎవరు ఎంతంటే అంతా సంపాదించుకోవచ్చని రంగారెడ్డి భూముల క్లియరెన్స్ చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన మీరే అమ్ముడుపోయి కోర్టుకు తప్పుడు అఫిడవిట్స్ ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అధికారుల బదిలీలు, వాళ్ల నుంచి వచ్చే సొమ్ము, వాళ్లు ప్రజలను జలగల్లా పీడించే తీరు రోజు ఏసీబీ ఎక్కడో ఒక దగ్గర పట్టుకుని అరెస్ట్ చేస్తున్న తీరు దీనంతటికి నిదర్శనం. మీ జిల్లాలో అవినీతి అధికారుల గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు. మంత్రులకు, నాయకుల రెవెన్యూ డెన్‌లకు వెళ్లి మీరు క్లియర్ చేస్తున్న ఫైల్స్ విలువ వేల కోట్లు. అడ్డు చెప్పాల్సింది పోయి అప్పనంగా అప్పగిస్తున్నారు. ఇవన్నీ బయటకు పొక్కుతున్నాయని ఇక్కడ నుంచి వెళ్లిపోయి చేతులు దులుపుకుందామని అనుకుంటే, మీరు చేసిన క్లియరెన్స్‌కి ఎప్పుడైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరూ చెప్పరనే ధీమా ఉన్నా, వాళ్ల పేర్లతో మీరు చేసిన దందాలు ఎన్నో మీరు వెళ్లిన తర్వాత అయినా బయటకు రాకుండా ఉండవని బాధితులు అంటున్నారు.

#RangareddyRevenueScam#CollectorNarayanaReddy#ACBTrapsRangareddy#SwechhaNewsExclusive#TelanganaRevenueCorruption#LandClearanceScam#RangaReddyPolitics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి