ఏపీ

Cm Vijay : నేడు ఏపీకి సీఎం విజయ్.. నదుల అనుసంధానానికి లైన్ క్లియర్?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 'విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొనడానికి కూటమి ఎంపీలు ఆహ్వానం పలకడంతో ఆయన హాజరవుతున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు రానున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 'విజయవాడ ఉత్సవ్ 2.0' కార్యక్రమంలో పాల్గొనడానికి కూటమి ఎంపీలు ఆహ్వానం పలకడంతో ఆయన హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, విజయ్ రాక సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో పలు కీలక చర్చలు జరపనున్నట్టు సమాచారం.దసరా వేడుకల్లో భాగంగా ముందుగా సీఎం విజయ్ ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు.

అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం, కృష్ణా నది నీటి విడుదలపై చర్చ జరపనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితులు నెలకొనడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కావేరి - గోదావరి నదుల అనుసంధానంపై ఇరు ప్రభుత్వాలు దృష్టిసారించినట్టు సమాచారం.ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడులో నీటి ఎద్దడి వేసవి రాకముందే మొదలైంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు మధ్య నదీ జలాల వివాదాలు నడుస్తున్నాయి. ప్రతిఏటా కావేరి బేసిన్‌కు నీళ్లు విడుదల చేయాలని తమిళనాడు సర్కార్ కర్ణాటకను రిక్వెస్ట్ చేయడం.. కోర్టులకు వెళ్లి సమస్య పరిష్కారం దిశగా ఫైట్ చేయడం జరుగుతోంది. కాగా, కావేరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టులకు కర్ణాటక సర్కార్ శ్రీకారం చుట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై తమిళనాడు సర్కార్ దృష్టిసారించింది.

ఈ నేపథ్యంలోనే ‘కావేరి-గోదావరి’ నదుల అనుసంధానంపై నేడు ఏపీ సీఎంతో.. తమిళనాడు సీఎం విజయ్ చర్చించనున్నట్టు తెలిసింది. గోదావరి నదిలోని అదనపు జలాలను కృష్ణా, పెన్నార్ నదుల మీదుగా కావేరి బేసిన్‌కు తరలించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అనేక లాభాలు కలుగుతాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. సమావేశం అనంతరం రాత్రి విజయవాడలో జరుగుతున్న జాతీయ సరస్ ప్రదర్శనను కూడా సీఎం విజయ్ తిలకించనున్నారు. ఆపై రాత్రి 9 గంటలకు చెన్నైకు సీఎం విజయ్ తిరుగు పయనం కానున్నారు.

#Tamilandu cm vijay#Andrapradesh#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి