International

సౌదీ యువరాజుకు భద్రతా ముప్పు.. బంకర్లలోకి మకాం!

రచన: Swechaanews Chairman••4 నిమిషాల పఠనం

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి, డ్రోన్ దాడులను విపరీతంగా పెంచడంతో ఆ దేశ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 'వాల్ స్ట్రీట్ జర్నల్' అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. రియాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ బంకర్లు కలిగిన రాజప్రాసాదాల మధ్యే ఆయన రహస్యంగా సంచరిస్తున్నారు.

 యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి, డ్రోన్ దాడులను విపరీతంగా పెంచడంతో ఆ దేశ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 'వాల్ స్ట్రీట్ జర్నల్' అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. రియాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ బంకర్లు కలిగిన రాజప్రాసాదాల మధ్యే ఆయన రహస్యంగా సంచరిస్తున్నారు.

 ప్రత్యేకంగా ఎంపిక చేసిన కమాండోల భద్రత నడుమ మకాం మారుస్తున్న ఆయన, గడిచిన మంగళవారం ఓ రక్తదాన శిబిరంలో పాల్గొన్న తర్వాత ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులను ఉధృతం చేయడమే ఈ భద్రతా ఆందోళనలకు ప్రధాన కారణం. గత శనివారం రియాద్‌లోని ప్రసిద్ధ కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు ప్రయోగించిన శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి పెను విధ్వంసం సృష్టించింది. ఈ దాడుల్లో 12 నుంచి 13 మంది ప్రాణాలు కోల్పోగా, 300మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

 విమానాశ్రయ టెర్మినల్స్ ధ్వంసమవడంతో పాటు ఆదివారం కూడా దాడులు కొనసాగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు, హౌతీల నుంచి వచ్చే క్షిపణులను గాలిలోనే పేల్చివేసేందుకు అవసరమైన 'ఇంటర్‌సెప్టార్' క్షిపణుల నిల్వలు సౌదీ అరేబియాలో వేగంగా అడుగంటుతున్నట్లు సౌదీ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న పరిమిత వాయు రక్షణ వ్యవస్థలను రాజకుటుంబ నివాసాలు, చమురు, ఇంధన ఉత్పత్తి కేంద్రాల రక్షణ కోసమే ప్రత్యేకంగా కేటాయించారు.

 ఇరాన్ మద్దతుతో జరుగుతున్న ఈ దాడులు సౌదీ ప్రతిష్టాత్మక 'విజన్ 2030' ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతాయని, పర్యాటకం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యాలకు ఈ పరిణామాలు గండికొడుతున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నడుమ సౌదీ అరేబియా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఒకవైపు మిత్రదేశాల నుంచి అదనపు రక్షణ సాయం కోరుతుండగా, మరోవైపు దౌత్యపరమైన పరిష్కారాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మధ్యప్రాచ్యంలో మారుతున్న ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

#SaudiCrownPrince#HouthiMissileAttacks#RiyadhAirportAttack#MBSBunker#SaudiYemenConflict#InternationalNewsTelugu#Vision2030Threat
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి