Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే? అవును బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగుతున్న నట వారసురాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి, రక రకాల కారణాలుంటున్నాయి. హీరోల కంటే హీరోయిన్స్‌గా తెలుగు తెరకి పరిచయమై, ఇక్కడ అగ్ర కథానాయికగా వెలగాలనుకుంటున్నప్పటికీ.. ఆ అదృష్టం దక్కడం లేదు.
శ్రీదేవీ కూతురు జాన్వీ:
అతిలోక సుందరి అలనాటి అగ్ర తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ముందుగా ధడక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కంప్లీట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాతో జాన్వీ అక్కడ మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా హిందీలో మంచి చిత్రాలు చేసింది. కానీ, తల్లిలాగా మాత్రం స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేకోపోయింది. బోనీ కపూర్ కూడా తన కూతుర్లను స్టార్స్‌గా చూడాలని ఆశ పడుతున్నాడు. శ్రీదేవి అయితే జాన్వీ, ఖుషీ కపూర్‌లను సౌత్‌లో పరిచయం చేసి ఇక్కడ స్టార్స్‌గా చూడాలని కలలు కనింది.
ఆ కల నెరవేరకుండానే ఆమె కన్ను మూసింది. ఇప్పటి వరకూ జాన్వీ తెలుగులో రెండు భారీ చిత్రాలు చేసింది. ఎన్‌టిర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్‌గా నటించి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత, చరణ్ సరసన పెద్ది సినిమాను చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక, దేవర 2 ఉంటుందా లేదా తెలియదు. ఉంటే, అందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుందా లేదా చెప్పలేము.
రవీనా కూతురు రషా కూడా సక్సెస్ కాలేదు:
రవీనా టాండన్ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్. తెలుగులో చేసిన సినిమాలు కూడా రవీనాకి మంచి గుర్తింపు తెచ్చాయి. బాలీవుడ్‌లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఒకదశలో, స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. చాలా ఏళ్ళ తర్వాత కేజీఎఫ్ 2తో తమిళంలో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికీ, ఇప్పటికీ పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి మార్పూ లేదనిపించుకుంది. కానీ, తన కూతురు రషా తడానీ తెలుగులో చేసిన డెబ్యూ సినిమా శ్రీనివాస మంగాపురం మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హీరోగా ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా రషాకి షాకిచ్చింది. అయినా, కూడా మళ్ళీ మరో ఛాన్స్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి హీరోయిన్‌గా మొన్నటి వరకూ శ్రీలీల పేరును పరిశీలించారు. ఇప్పుడు, రషా తడానికి ఆ ఛాన్స్ దక్కిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే, రషా లక్ ని మరోసారి చెక్ చేసుకుండేమో చూడాలి.


