తెలంగాణ

TG: ‘NO’ అని ఒక్క మెసేజ్ ఇస్తే చాలు.. బ్యాంక్ ఖాతా ఖాళీ: సీపీ సజ్జనార్

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: ఓటీపీ ఎవరికీ చెప్పలేదు.. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపైనా క్లిక్ చేయలేదు.. అయినా సరే అకౌంట్‌లోని డబ్బులు క్షణాల్లో మాయమైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుంటూ కనివినీ ఎరుగని సరికొత్త దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం వాట్సాప్‌లో 'NO' అని ఒకే ఒక్క రిప్లై ఇస్తే మీ ఖాతాలోని డబ్బంతా గోవిందా అంటున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ సరికొత్త సైబర్ మాయాజాలంపై ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇంతకీ ఏం జరుగుతోంది?

సాధారణంగా బ్యాంక్ మోసాలు అంటే ఓటీపీలు అడగడం లేదా లింకులు పంపి క్లిక్ చేయించడం చూశాం. కానీ ఇక్కడ స్కెచ్ పూర్తిగా భిన్నం. గుర్తుతెలియని నంబర్ల నుంచి "మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇంత నగదు కట్ అయ్యింది" అంటూ నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఒకవేళ ఆ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే 'NO' అని రిప్లై ఇవ్వాలంటూ కంగారు పెడతారు. కంగారుపడి ఖాతాదారులు ఒక్కసారి ‘NO’ అని మెసేజ్ పంపారో.. ఇక అంతే సంగతులు. తెరవెనుక 'ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్' ద్వారా మాల్‌వేర్ స్క్రిప్ట్‌లు యాక్టివేట్ అయిపోతాయి. దీంతో యూజర్ ప్రమేయం లేకుండానే మొబైల్ పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోయి క్షణాల వ్యవధిలో నగదు లూటీ అయిపోతోంది.

సీఏ ఖాతా నుంచే రూ.లక్ష స్వాహా..

ఈ తరహా మోసానికి సాక్షాత్తూ ఓ చార్టర్డ్ అకౌంటెంట్ బలైపోయారని, ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ.లక్ష మాయమయ్యాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. అందుకే సాధారణ ప్రజల నుంచి టెక్నాలజీ తెలిసిన వారి వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంకు లావాదేవీల మెసేజ్‌లు వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ 'YES' లేదా 'NO' అంటూ రియాక్ట్ కాకుడదని చెప్పారు. అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా అనే మెసేజ్ రాగానే భయపడకుండా.. వెంటనే మీ అఫిషియల్ బ్యాంకింగ్ యాప్‌ను ఓపెన్ చేసి స్టేట్‌మెంట్ స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏమైనా డౌట్స్ ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లోని కస్టమర్ కేర్ నంబర్‌కు మాత్రమే కాల్ చేసి కన్ఫార్మ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఈ సైబర్ ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకుంటే.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కంప్లైంట్ చేయాలి, లేదంటే cybercrime.gov.in పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

#TG News#Hyderabad News#CP Sajjanar#VC Sajjanar#Cyber Crime#WhatsApp Scam#Banking Fraud#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి