సినిమా

Tollywood:మోక్షజ్ఞ డెబ్యూకి బాలయ్య ఎంటరైతే ఏంటి పరిస్థితి?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: డెబ్యూ హీరోగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో నట వారసులైతే ఓ లెక్క..సోలోగా వచ్చే వాళ్ళైతే ఓ లెక్క ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ, పెద్ద కుటుంబ నుంచి వస్తున్న డెబ్యూ హీరో సినిమా అంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ ప్రతీ విషయంలో కలగజేసుకొని..కథలో వేలు పెడితే దర్శకుడికి మెంటలెక్కుతుంది. ఇప్పుడు, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి ఇదే జరగబోతోంది. ఈ సినిమాకి సంబందించిన ప్రతీ విషయంలో బాలయ్య ఎంటరవుతున్నాడట.

నాలుగైదేళ్ళ నుంచి నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీనికి, కారణాలు ఏంటీ అంటే, బాలయ్య సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పుకున్నారు. అలాగే, మోక్షజ్ఞ లుక్ కూడా హీరో మెటీరియల్ గా అనిపించలేదు. దాంతో, మోక్షజ్ఞ ఇంకా రెడీ కాలేదని పైకి కవర్ చేస్తూ వచ్చారు.

ఎట్టకేలకి, ఇటీవలే బాలయ్య కొడుకు సినిమాను మైత్రీ వారు నిర్మిస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒకే ఒక్క సినిమా చేసిన దర్శకుడు మల్లిడి వశిష్టకి ప్రాజెక్ట్ అప్పగించడం. సాధారణంగా ఫిల్మ్ సర్కిల్స్‌లో అంతా కూడా మోక్షజ్ఞ మొదటి సినిమాను బోయపాటికో, పూరి జగన్నాధ్‌కో అప్పగిస్తారని చెప్పుకున్నారు. అలాగే, ప్రశాంత్ వర్మ ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు చెప్పుకున్నారు. కానీ, ఇవేవి జరగలేదు. దీనికి, కారణం బాలయ్య తన కొడుకు మొదటి సినిమా కాబట్టి, కథ, కథనం, మ్యూజిక్ సహా ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నడట.

ఇలా, చేస్తే దర్శకుడు అనుకున్న విధంగా అవుట్‌పుట్ రాదు. ఇందులో, సందేహమే లేదు. గతంలో కూడా ఇలాంటి అనుభవాలను చూసిన దర్శకులున్నారు. వారసులను పరిచయం చేసేటప్పుడు లిబర్టీ తగ్గుతుంది. పైగా, ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. ఇలాంటి, పరిస్థితుల్లో వశిష్ట..మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తై..మోక్షజ్ఞకి హిట్ ఇస్తే ఖచ్చితంగా వశిష్ట గట్టోడు అనుకోవాల్సిందే. ఇక, ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి, బాలయ్య ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.

#Balakrishna#Mokshagna#NBK#Mallidi Vassishta#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి