తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో విజృంభిస్తోన్న వైరస్‌.. వీరికి పొంచి ఉన్న ప్రమాదం!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

నగరంలో ఫ్లూ వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.. ముఖ్యంగా చాపకింద నీరులా ఇన్‌ఫ్లూయెంజా A రకం వైరస్‌ విస్తరిస్తోంది. నిలోఫర్‌తో పాటు కొన్ని ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే 60 ఏళ్లు దాటిన చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

నగరంలో ఫ్లూ వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.. ముఖ్యంగా చాపకింద నీరులా ఇన్‌ఫ్లూయెంజా A రకం వైరస్‌ విస్తరిస్తోంది. నిలోఫర్‌తో పాటు కొన్ని ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే 60 ఏళ్లు దాటిన చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరికొందరిలో అయితే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జ్వరం వస్తే అది సాధారణ జ్వరమే అనే నిర్లక్ష్యం తగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే.. ఇన్‌ఫ్లూయెంజా A వైరస్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ సోకిన వారిలో హఠాత్తుగా అధిక జ్వరం, పొడిదగ్గు, తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ఆలసట వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

అలాగే ఈ వైరస్ సోకిన వాళ్ళు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు గాలిలోకి విడుదలయ్యే తుంపరల వల్ల ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుందని, ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఈ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

మరోవైపు ఇన్‌ఫ్లూయెంజాలో సాధారణ జ్వరానికి, ప్రమాదకరమైన పరిస్థితికి మధ్య తేడాను గుర్తించడం అత్యంత కీలకమని వైద్యులు అంటున్నారు. ప్రారంభంలో సాధారణ ఫ్లూలాగే కనిపించినప్పటికీ కొందరిలో ఇది వేగంగా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన న్యూమోనియాగా శ్వాసకోశ వైఫల్యానికి దారితీసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

అలాగే ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది రావడం, ఆయాసం పెరగడం, పిల్లికూతలు, శ్వాస వేగంగా తీసుకోవడం, ఛాతీ భాగంలో నొప్పి, బరువుగా గుండె పట్టేసినట్లు అనిపించడం, శరీరంలో ఆక్సిజన్‌స్థాయి పడిపోయి పెదవులు, గోళ్లు, ముఖం నీలం రంగులోకి మారడం, తలతిరగడం, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన మగత, అయోమయ పరిస్థితి, ఆగకుండా వాంతులు ఉంటే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు..

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ 19 తరహా జాగ్రత్తలు అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాలకు చిన్న పిల్లలను తీసుకపోక పోవడం మంచిదని, ఒకవేళ తప్పక వెళ్లవలసిన పరిస్థితులు తలెత్తితే ముఖానికి మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు.

అలాగే క్రమం తప్పకుండా చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, కళ్లు, ముక్కు, నోటిని తరచూ చేతులతో తాకకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తూనే.. రోజు కాచి చల్లార్చిన నీటినే తాగడం చేయాలి.. ఇక పౌష్టికాహారం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఫలితంగా కొంతవరకైనా ఈ వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశాలున్నట్టు వైద్యులు తెలియచేస్తున్నారు..

#Hyderabad#Viral Fever#influenza-a-concerns-rise#children-and-seniors risk#High fever#dry cough#severe headache#body aches#sore throat#fatigue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి