National

Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలకు నో -ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

రచన: NK•••5 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీ నిరసనలతో హోరెత్తిపోతోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలకు సీజేపీ, విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీ నిరసనలతో హోరెత్తిపోతోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలకు సీజేపీ, విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్నాలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్ విషయలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ లో ధర్నాలు, నిరసనలకు నో చెప్పారు. జంతర్ మంతర్ ఇకపై చట్టబద్ధమైన నిరసన ప్రదేశం కాదని స్పష్టం చేశారు.

నిరసన వేదిక నుంచి జంతర్ మంతర్ డీ-నోటిఫై

నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అక్కడ ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏ మాత్రం నిరసన ప్రదర్శనలకు జంతర్ మంతర్ వేదిక కాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు నిరసన వేదిక నుంచి జంతర్ మంతర్ ను డీ-నోటిఫై చేస్తూ ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నిరసన వేదికలను మారుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇకపై జంతర్ మంతర్‌ను నిరసన వేదికగా పరిగణించబోమన్న ఢిల్లీ పోలీసులు.. నిరసనల కోసం ప్రత్యామ్నాయ, సరైన వేదికలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

నిరసనల కోసం 3 ప్రత్యామ్నాయ ప్రదేశాలు

అదే సమయంలో జంతర్ మంతర్ కు బదులుగా నిరసనల కోసం మరో మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు సూచించారు. రామ్ లీలా మైదాన్ (సెంట్రల్ ఢిల్లీ), సీబీడీ గ్రౌండ్ (ఈస్ట్ ఢిల్లీ), బురారీ (నార్త్ ఢిల్లీ) గ్రౌండ్ లను నిరసన వేదికలుగా వినియోగించుకోవచ్చని వెల్లడించారు. కొత్త వేదికల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి విధివిధానాలను త్వరలోనే జారీ చేస్తామన్నారు. సీఈసీ రాజీనామా డిమాండ్ తో సీజేపీ, విపక్షాలు దేశ రాజధానిలో ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ఈ తరుణంలో జంతర్ మంతర్ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోదీ పిరికి నియంత

జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఒక పిరికి నియంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిరికి నియంత మోదీ జంతర్ మంతర్ ను యుద్ధ భూమిగా మార్చేశారని మండిపడ్డారు. ఇప్పుడిక దేశం మొత్తం జంతర్ మంతర్ గా మారుతుందని హెచ్చరించారు. ఇవాళ జంతర్ మంతర్ ను ధర్నా వేదికగా రద్దు చేసిన ప్రధాని మోదీ.. రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేస్తారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సమస్య ప్రొటెస్ట్ సైట్ కాదు.. ప్రజలు ధర్నా చేయడమన్న ఆలోచనే సమస్యగా భావిస్తున్నారు అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

#Jantar Mantar#Delhi Police#Protest Site#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి