క్రైమ్

డబ్బు కోసమే పాప కిడ్నాప్, హత్య- బొల్లారం చిన్నారి కేసులో సంచలన విషయాలు

రచన: NK•••6 నిమిషాల పఠనం

Bollaram Child: రాష్ట్రంలో సంచలనం రేపిన బొల్లారం కౌకూర్ లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. డబ్బు కోసమే సెక్యూరిటీ గార్డుగా పని చేసిన విక్రమ్ కుమార్ చిన్నారి అరేలియాను కిడ్నాప్ చేసి చంపేసినట్లు వెల్లడించారు.

Bollaram Child: రాష్ట్రంలో సంచలనం రేపిన బొల్లారం కౌకూర్ లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. డబ్బు కోసమే సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి చంపేసినట్లు వెల్లడించారు. పాపను చంపాకే అతడు డబ్బు డిమాండ్ చేశాడని తెలిపారు. చిన్నారిని కిడ్నాప్ చేసి 20లక్షలు డిమాండ్ చేయాలని విక్రమ్ భావించాడని మల్కాజ్ గిరి సీపీ సుమతి తెలిపారు. చిన్న కుటుంబం, ధనిక కుటుంబం కావడంతో డబ్బులు ఇస్తారని విక్రమ్ భావించాడని పేర్కొన్నారు. పాపను చంపి నీటి సంపులో వేశాకే విక్రమ్ కుమార్ డబ్బు కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడని వెల్లడించారు.

డబ్బు కోసమే కిడ్నాప్.. దొరికిపోతాననే భయంతో హత్య

నిందితుడి కోసం 10 పోలీసు బృందాలు గాలించాయన్నారు. ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. క్లబ్ హౌస్ సెల్లార్ లోని నీటి సంపులో చిన్నారి మృతదేహం గుర్తించామన్న పోలీసులు.. సెక్యూరిటీ గార్డుగా పని చేసి మానేసిన విక్రమ్ కుమార్ ను అనుమానించామన్నారు. పాప తనతో ఉంటే తాను బయటకు వెళ్లలేనని, దొరికిపోతానని విక్రమ్ భయపడ్డాడని అందుకే పాపను చంపేశాడని పోలీసులు చెప్పారు. సెల్లార్ లోకి ఎవరూ వెళ్లరని, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని తెలిసిన విక్రమ్.. ఆ ప్లేస్ ను ఎంచుకున్నాడని వెల్లడించారు. అతి త్వరలో విచారణ పూర్తి చేసి విక్రమ్ కు శిక్ష పడేలా చూస్తామన్నారు.

పాప కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేశాడు

''10వ తేదీన సాయంత్రం పాప మిస్సింగ్ అయ్యింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో క్లబ్ హౌస్ సెల్లార్ లోని వాటర్ సంపులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. పాప కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేశాడు. చిన్నారి నడుముకు రెండు ఇటుకలు కట్టాడు. బిహార్ కు చెందిన మరో సెక్యూరిటీ గార్డు ఫోన్ నుంచి పాప పేరెంట్స్ కు విక్రమ్ కాల్ చేశాడు. పాపను కిడ్నాప్ చేశానని, 20లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, వీడియో కాల్ లో చిన్నారిని చూపించాలని కుటుంబసభ్యులు కోరారు. చిన్నారిని చూపించకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు నిందితుడు.

చిన్నారిని నమ్మించి తీసుకెళ్లాడు

క్లబ్ హౌస్ సెల్లార్ జీ మైనస్ 1 లోని నీటి సంపులో పాప డెడ్ బాడీని గుర్తించాము. సెప్టెంబర్ 22 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు విక్రమ్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అతడి ప్రవర్తన సరిగా లేదని విల్లా యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. 10వ తేదీ సాయంత్రం గేటెడ్ కమ్యూనిటీ లోపలికి విక్రమ్ వచ్చాడు. సైకిల్ పై ఆడుకుంటున్న చిన్నారిని చూశాడు. పాపను నమ్మించి తీసుకెళ్లాడు. హత్య చేసి బయటకు వెళ్లాక డబ్బు డిమాండ్ చేయాలనుకున్నాడు'' అని పోలీసులు వెల్లడించారు.

బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి

ఈ ఘటనతో గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న వారికి పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లు, వాచ్ మెన్లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సేవా సిబ్బందిని ఎవరిని నియమించినా వారి చిరునామాలు తీసుకోవాలన్నారు. కచ్చితంగా వారి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పని వాళ్ల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశామన్నారు.

మేడ్చల్‌ జిల్లా బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌లో విల్లా ఆర్కిడ్‌ గేటెడ్ కమ్యూనిటీలో మిల్టన్‌ ఫెర్నాండెజ్‌ నివాసం ఉంటున్నారు. అదే విల్లాలో నిందితుడు విక్రమ్ వాచ్‌మన్‌గా పని చేశాడు. డబ్బు కోసం విక్రమ్ దారుణానికి ఒడిగట్టాడు. ఫెర్నాండెజ్ ఐదేళ్ల కూతురు అరేలియా మోజెస్‌ కిడ్నాప్, హత్య ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విల్లాలో సెక్యూరిటీ గార్డుగా పని చేసిన విక్రమ్‌ డబ్బు కోసం ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.

#Hyderabad#Secunderabad#Bollaram#Kowkoor#Fiver Year Old Girl#Kidnap#Kill#Security Guard#Vikram#Villa Orchids#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి