వైరల్ న్యూస్

VIRAL: బైక్‌లతో దుర్గామాత రూపం.. బీచ్‌లో బైకర్ల అద్భుత ప్రదర్శన!

రచన: Mamatha puppala•••3 నిమిషాల పఠనం

శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని గుజరాత్‌కు చెందిన బైకర్లు తమలోని సృజనాత్మకతను చాటుకుంటూ భక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు. సూరత్ నగరానికి చెందిన ‘సూరత్ బైకింగ్ కమ్యూనిటీ' (Surat Biking Community) సభ్యులు డభారీ బీచ్‌లో ఏకంగా 71 ప్రీమియం మోటార్‌సైకిళ్లతో భారీ దుర్గామాత చిత్రాన్ని రూపొందించారు.

 శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని గుజరాత్‌కు చెందిన బైకర్లు తమలోని సృజనాత్మకతను చాటుకుంటూ భక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు. సూరత్ నగరానికి చెందిన ‘సూరత్ బైకింగ్ కమ్యూనిటీ' (Surat Biking Community) సభ్యులు డభారీ బీచ్‌లో ఏకంగా 71 ప్రీమియం మోటార్‌సైకిళ్లతో భారీ దుర్గామాత చిత్రాన్ని రూపొందించారు. పండుగ సంప్రదాయాలకు భిన్నంగా తమకు ఇష్టమైన బైక్‌ల ద్వారా అమ్మవారికి అంకితమిచ్చిన ఈ రూపం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

 డభారీ సముద్ర తీరంలో ఇసుకపై పకడ్బందీ ప్రణాళికతో ఈ బైక్‌లను అత్యంత కచ్చితత్వంతో ఈ ఏర్పాట్లు చేశారు. కింద నుంచి చూస్తే సాధారణంగా పార్క్ చేసిన బైక్‌లలాగే కనిపించినప్పటికీ, డ్రోన్ కెమెరాల ద్వారా ఆకాశం నుంచి వీక్షించినప్పుడు సాక్షాత్తూ దుర్గామాత దివ్య రూపం స్పష్టంగా దర్శనమిచ్చింది. అమ్మవారి కిరీటం, కళ్లు వంటి ముఖావయవాలు ఖచ్చితంగా రూపుదిద్దుకునేలా వందలాది మంది బైకర్లు శ్రమించి ఈ కళాఖండాన్ని సృష్టించారు.

 సంప్రదాయ వేడుకలకు భిన్నంగా యువత చేపట్టిన ఈ సాహసోపేతమైన ప్రయత్నం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నవరాత్రులను జరుపుకుంటున్న తరుణంలో, బైకర్ల ఈ ప్రత్యేక నివాళి అందరినీ ఆకట్టుకుంటోంది. మోటార్‌సైకిళ్లపై మక్కువను ఆధ్యాత్మిక భావనతో జోడించి వారు చూపిన ప్రతిభ అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. నవరాత్రుల మొదటి రోజునే వెలుగులోకి వచ్చిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

#SuratBikers#MaaDurgaPortrait#Navratri2026#DabhariBeach#PremiumMotorcycles#GujaratNews#ViralVideoTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి