ఏపీ

Andhra Pradesh: ఏపీలో ఎన్నికలకు మొదలైన కౌంట్ డౌన్.. వర్గాల వారీగా సీట్ల వివరాలు ఇవే!..

రచన: Venu••6 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల రిజర్వేషన్లపై కీలక కసరత్తు పూర్తయింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల రిజర్వేషన్లపై కీలక కసరత్తు పూర్తయింది. మొత్తం 17 నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు స్థానాలను కేటాయించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒక వర్గానికి కేటాయించిన కొన్ని కార్పొరేషన్లను ఈసారి మరో వర్గానికి మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక 106 పురపాలక సంఘాల్లోనూ వివిధ కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో ముందుగా నగరపాలక సంస్థల విషయానికి వస్తే.. మొత్తం 17 కార్పొరేషన్లలో ఒకటి ఎస్టీ, రెండు ఎస్సీ, ఐదు బీసీ, ఐదు జనరల్ మహిళలు, మరో నాలుగు అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్టీ కేటగిరీకి మంగళగిరి నగరపాలక సంస్థను కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో కర్నూలు మహిళలకు, రాజమహేంద్రవరం జనరల్‌కు కేటాయించారు.

అదేవిధంగా బీసీ కేటగిరీలో కాకినాడ, మచిలీపట్నం మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు జనరల్‌కు కేటాయించారు. ఇక జనరల్ మహిళల కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం వంటి నగరపాలక సంస్థలు ఉన్నాయి. అలాగే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు నగరపాలక సంస్థలను చేర్చారు.

గత 2021 ఎన్నికల్లో కాకినాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు జనరల్ మహిళలకు కేటాయించగా, ఈసారి బీసీ మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో బీసీ మహిళలకు కేటాయించిన విజయనగరం, శ్రీకాకుళం కార్పొరేషన్లను ఈసారి జనరల్ మహిళల కేటగిరీలోకి మార్చారు. దీంతో ఈ నాలుగు కార్పొరేషన్లలో రిజర్వేషన్ల కేటాయింపులు మారనున్నాయి..

ఇక పురపాలక సంఘాల విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు కేటాయించారు. అందులో ఎస్టీ కేటగిరీలో మూడు పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గూడూరు మహిళలకు కేటాయించగా, ఆలూరు, ఆత్మకూరు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఏడు మహిళలకు, మరో ఏడు జనరల్ కేటగిరీకి కేటాయించారు.

మరోవైపు మహిళల జాబితాలో చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల ఉన్నాయి. అదేవిధంగా బీసీ కేటగిరీలో మొత్తం 36 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో 18 మహిళలకు, మరో 18 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మహిళల జాబితాలో చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం ఉన్నాయి.

ఇక బీసీ జనరల్ కేటగిరీలో కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అద్దంకి, కమలాపురం, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, కర్నూలు జిల్లాలోని గూడూరు, మైదుకూరు, బద్వేలు మొదలైన గ్రామాలు ఉన్నాయి. అలాగే జనరల్ మహిళల కేటగిరీలో 27 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో కనిగిరి, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు ఉన్నాయి.

ఇక 26 పురపాలక సంఘాలను అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో చేర్చారు. వీటిలో సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల కేటాయింపు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు కీలకంగా మారనుంది.

#Andhra-pradesh#municipal-election#preparing-contesting-candid#reservations-final-list#details by category
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి