International

Sudan: సూడాన్ బంగారు గనిపై బాంబుల వర్షం.. 72 మంది మృతి!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Sudan: సూడాన్ - ఈజిప్ట్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతంలో తీవ్ర రక్తపాతం చోటుచేసుకుంది. ఎడారి పర్వతాల నడుమ బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న అమాయక కార్మికులపై ఆకాశం నుంచి మృత్యువు బాంబుల రూపంలో విరుచుకుపడింది. జబల్ అల్ ఉఖైదాత్ ప్రాంతంలోని ఓ బంగారు గనిపై జరిగిన భీకర వైమానిక దాడిలో ఏకంగా 72 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

ఐదుసార్లు విరుచుకుపడ్డ యుద్ధ విమానం

శనివారం ఉదయం వేలాది మంది కార్మికులు గనిలో పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ యుద్ధ విమానం గగనతలంలో ప్రత్యక్షమైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ ఫైటర్ జెట్ వరుసగా ఐదుసార్లు గనిపై బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. బాంబుల మోతతో భయకంపితులైన కార్మికులు ప్రాణాలు దక్కించుకునేందుకు పర్వతాల పైకి, సమీపంలోని మార్కెట్ వైపు పరుగులు తీశారు. తప్పించుకునే క్రమంలో నేలపై పడి ఉన్న తోటి కార్మికుల మృతదేహాలను చూశామని, ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతమయ్యారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఈ నరమేధానికి ఈజిప్ట్ వైమానిక దళమే కారణమని సూడాన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ 'ఎమర్జెన్సీ లాయర్స్' తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఈజిప్ట్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ తవ్వకాలను అడ్డుకునే నెపంతో గత జూన్‌లోనూ జరిగిన వైమానిక దాడిలో 23 మంది మరణించారు. ఇప్పుడు ఏకంగా 72 మందిని బలిగొన్న రెండో దాడి జరగడం ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 2023 నుంచి సూడాన్‌లో సాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది ప్రజలు పొట్టకూటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకర బంగారు గనుల్లో పనిచేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న సరిహద్దుల్లో జరిగిన ఈ దాడిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

#Sudan#Sudan Airstrike#Gold Mine Attack#72 Dead#Sudan-Egypt Border#Sudan Civil War#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి