తెలంగాణ

Osmania: ఉస్మానియాలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. డిమాండ్స్ ఇవే

రచన: NK•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ ఉస్మానియాలో సమ్మె సైరన్ మోగింది. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి, ఆరోగ్యశ్రీ బకాయిలతో వైద్య సేవలు స్తంభించిపోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

Osmania: హైదరాబాద్ ఉస్మానియాలో సమ్మె సైరన్ మోగింది. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి, ఆరోగ్యశ్రీ బకాయిలతో వైద్య సేవలు స్తంభించిపోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియాలో రోగులకు వైద్యం చేసేందుకు సరైన వసతులు లేవని ఆరోపిస్తూ విధుల బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, ఆసుపత్రికి అత్యవసర పరికరాలు, సర్జికల్స్, మందులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.

పాడైన పరికరాలు, తీవ్రమైన మందుల కొరత

పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు 700 మంది ఆందోళనలో పాల్గొన్నారు. రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడంతో క్యాటలాగ్ సర్జరీలు నిలిచిపోయాయని వాపోయారు. పాడైన వైద్య పరికరాలు మార్చకపోవటం, ఓపీ విభాగంలో మందుల అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు సరైన శిక్షణ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

పేరుకుపోయిన బకాయిలు

''ఉస్మానియాలో అనేక సమస్యలు ఉన్నాయి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మా సమస్యల గురించి ప్రభుత్వానికి చాలాసార్లు వినతిపత్రాలు ఇచ్చాము. మాకు శిక్షణ ఇచ్చే వారు కూడా లేరు. బకాయిలు చెల్లించకపోవడంతో మాకు అవసరమైన మెటీరియల్ అందడం లేదు. మెషినరీ సరిగా పని చేయడం లేదు. అత్యవసరమైన మందుల కొరత తీవ్రంగా ఉంది. పాత వెంటిలేటర్స్ ఉన్నాయి. అవి సడెన్ గా ఆగిపోతున్నాయి. ఉస్మానియాలో ఎంఆర్ఐ చేయాలంటే రోగులు 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. వసతులు ఏ మాత్రం బాగోలేవు. ఎమర్జెన్సీ వార్డులో టేబుల్ ఊగుతోంది'' అని జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను ప్రస్తావించారు.

#Osmania#Junior Doctors Protest#Telangana#Dues#Swechaa News#Hyderabad#Aarogyasri Funds
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి