National

GST Clarification: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై 5% జీఎస్టీ బాదుడు? కేంద్రం బిగ్ క్లారిటీ ఇదే!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

GST Clarification: జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా 5 శాతం జీఎస్టీ భారం మోపిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. నిత్యం ఆన్‌లైన్‌లో ఫుడ్ మొదలైన ఆర్డర్ చేసే సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడనుందంటూ జరుగుతున్న ప్రచారంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

GST Clarification: జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా 5 శాతం జీఎస్టీ భారం మోపిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. నిత్యం ఆన్‌లైన్‌లో ఫుడ్ మొదలైన ఆర్డర్ చేసే సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడనుందంటూ జరుగుతున్న ప్రచారంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.

ఏకంగా 18% నుంచి 5 శాతానికి తగ్గించారు

ఈ వివాదంలో అసలు సంచలన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం పన్ను పెంచకపోగా, ఏకంగా 13 శాతం తగ్గించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై కొత్తగా ఎలాంటి పన్నులు విధించలేదు. గతంలో ఈ సేవలపై ఏకంగా 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండేది. అయితే ఇటీవల జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ భారాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 18 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును ఏకంగా 5 శాతానికి తగ్గించారు.

వాటిని నమ్మొద్దు.. షేర్ చేయొద్దు

ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను రేటును తగ్గించడాన్ని కొందరు తప్పుగా చిత్రీకరించి, కొత్తగా 5 శాతం పన్ను మోపారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించింది. ఇ-కామర్స్ వేదికల ద్వారా అందే అన్ని రకాల డెలివరీ సేవలకు ఇకపై ఈ 5 శాతం పన్ను మాత్రమే వర్తిస్తుందని, ఇది యూజర్స్‌కి ఊరట కలిగించే అంశమని అధికారులు స్పష్టం చేశారు. నెట్టింట వైరల్ అయ్యే తప్పుడు వార్తలను గుడ్డిగా నమ్మి ఆందోళన చెందవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా వార్తను నమ్మేముందు అధికారిక వర్గాల సమాచారాన్ని చెక్ చేసుకోవాలని సూచించింది.

#GST Clarification#Online Food Orders#5% GST#GST Rates#Zomato#Swiggy#Food Delivery Apps#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి