తెలంగాణ

TG: ఢిల్లీలోనే ఉండండి.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సీఎం ఆదేశాలు

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయాలు, వివాదాస్పద సర్ అంశాలకు వ్యతిరేకంగా విపక్ష 'ఇండియా' కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, ఆ వెంటనే చెలరేగిన తొక్కిసలాటలో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు కిందపడి గాయపడటం కలకలం రేపింది.

TG: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయాలు, వివాదాస్పద సర్ అంశాలకు వ్యతిరేకంగా విపక్ష 'ఇండియా' కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, ఆ వెంటనే చెలరేగిన తొక్కిసలాటలో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు కిందపడి గాయపడటం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ బాట పట్టారు. అయితే సోమవారం ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో నిరసనకారులు చెల్లాచెదురై తొక్కిసలాట జరిగింది. ఈ తీవ్ర తోపులాటలో తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు కిందపడిపోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

‘చెప్పేంత వరకు ఢిల్లీ విడిచి రావొద్దు’..

రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అప్రమత్తమయ్యారు. గాయపడిన నేతల వివరాలు తెలుసుకుంటూనే, తెలంగాణ ప్రజాప్రతినిధులకు గట్టి సందేశం పంపారు. "మేము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎవరూ ఢిల్లీ వదిలి హైదరాబాద్ రావొద్దు" అని స్పష్టం చేశారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, కేంద్రం వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు నేతలంతా ఢిల్లీలోనే ఉండి ఆందోళనల్లో భాగస్వామ్యం కావాలని తేల్చిచెప్పారు. దీంతో టీ-కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా దేశరాజధానిలో మోహరించడంతో ఈ రాజకీయ సమరం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

#TG News#Telangana Politics#Revanth Reddy#Mahesh Kumar Goud#Bhatti Vikramarka#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి