తెలంగాణ

ఆ ప్రచారంలో నిజం లేదు- హైదరాబాద్ వాటర్ బోర్డు క్లారిటీ

రచన: NK•••3 నిమిషాల పఠనం

ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ లోని జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారం నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దీంతో ఈ అంశంపై హైదరాబాద్

Fact Check Telangana: ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ లోని జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీంతో ఈ అంశంపై ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) స్పందించాయి. ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని HMWSSB స్పష్టం చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది.

అలాంటి మెసేజ్ ను HMWSSB ఎక్కడా కూడా విడుదల చెయ్యలేదని అధికారికంగా తెలియజేసింది. జలాశయాల్లో నీటి మట్టాలు, నీటి సరఫరా నిలిపివేతకు సంబంధించి వస్తున్న ప్రచారాలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు కేవలం ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి అని అధికారులు సూచించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ఫార్వర్డ్ అయ్యే సమాచారాన్ని నమ్మి, భయబ్రాంతులకు గురి కావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరాకు సంబంధించిన తాజా సమాచారం కోసం HMWSSB అధికారిక మాధ్యమాలను అనుసరించాలని సూచించారు. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ విభాగం ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి