తెలంగాణ

ACB: రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్, మండల సర్వేయర్

రచన: NK•••4 నిమిషాల పఠనం

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ చిక్కారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ బి.సుదర్శన్‌రెడ్డిని కూడా నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ చిక్కారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ బి.సుదర్శన్‌రెడ్డిని కూడా నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు భూమిని సర్వే చేసి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు నిందితులు లంచం డిమాండ్‌ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయగా రూ.20 లక్షలకు డీల్ కుదిరింది. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మండల సర్వేయర్‌ ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సర్వేయర్‌ నుంచి రూ.20 లక్షల లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని ఏసీబీ వెల్లడించింది. ఇద్దరు అధికారులు తమ విధులను అక్రమంగా, అవినీతిపూరితంగా నిర్వహించినట్లు పేర్కొంది.

నిందితులైన మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్‌ బి.సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించడం లేదన్నారు.

కాగా, స్వేచ్ఛ న్యూస్ ఎప్పుడో హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే శాఖలో బదిలీల వ్యవహారం కోట్లాది అక్రమాలకు వేదికగా మారిందని కథనాలు రాసింది. బదిలీల సమయంలో పెద్దఎత్తున లంచాలు తీసుకున్నారని.. అందుకే వారిప్పుడు ఇలా తెగబడుతున్నారని.. సర్వేయర్లు వందల కోట్లు సంపాదిస్తున్నారని బయటపెట్టింది. స్వేచ్ఛ న్యూస్ అప్రమత్తం చేసినా ప్రభుత్వం మాత్రం అప్రమత్తం కాలేదు.

ACB: రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్, మండల సర్వేయర్

ACB: రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్, మండల సర్వేయర్

#ACB#Abdullapurmet Tahsildar#Abdullapurmet Surveyor#Bribe#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి