తెలంగాణ

TG : ఎల్‌నినో ఎఫెక్ట్.. నిప్పుల గుండంగా మారనున్న తెలంగాణ!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణలో కరువు పరిస్థితులతో పాటు ఎండలు తీవ్రంగా ముదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో వేసవి సమయంలో 45 డిగ్రీల వరకు ఎండలు కొడతాయి.కానీ, ఈసారి 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణలో కరువు పరిస్థితులతో పాటు ఎండలు తీవ్రంగా ముదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో వేసవి సమయంలో 45 డిగ్రీల వరకు ఎండలు కొడతాయి.కానీ, ఈసారి 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, వృద్ధులు, పశుపక్షాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వడదెబ్బకు మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వడదెబ్బలతో అప్రమత్తం..

విద్యార్థులకు ముందస్తుగానే వేసవి సెలవులు ప్రకటించాలని, అవసరమైతే డిజిటల్ విధానంలో పాఠాలు బోధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి.శీతాకాలం రాకముందే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీరా వింటర్ ముగిసి సమ్మర్ ఎంటర్ అయ్యే సమయంలో వేడిగాలులు విపరీతంగా వీస్తాయని, ఎండల తీవ్రతకు జనాలు పిట్టల్లా రాలిపోయే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు చేశారు.

10 నెలలు తీవ్ర కరువు!

వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాల రాక వరకు ఇలాంటి పరిస్థితులే దేశవ్యాప్తంగా నెలకొంటాయని వెల్లడించారు. సాగు, తాగు నీటికి ఎద్దడి ఉంటుందని, తీవ్ర కరువు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పంటలు పండక, నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో రానున్న 10 నెలలు, ఆపై కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

తాగు నీటికి ఎద్దడి..

పంటలకు సాగునీరు అందించడం కష్టమే అని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇదిలాఉండగా, రోజుకు దాదాపు మూడు అడుగుల మేర భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. సాధారణ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు 50 శాతమే ఉన్నాయి. అందుబాటులో ఉన్న నీటిని తాగునీరు, పశువుల అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.నీరు దొరకక పశుసంపదకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ మేరకు ముందస్తు ప్రణాళికలు అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ప్రకటించారు. కాగా, ఈ విపత్కర పరిస్థితుల్లో తాగు నీటికే ప్రాధాన్యం ఇస్తామని, సాగు నీరు ఇవ్వలేమని రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు.

#Elnino#telangana#drought situations#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి