ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడులకు గురవుతూనే ఉన్నాయి.మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాల కారణంగా చమురుకు భారీ డిమాండ్ ఏర్పడింది.మడి చమురు కొరత కారణంగా చాలా దేశాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు నేల చూపులు చూస్తున్నాయి. తమ శత్రుదేశాల నుంచి చమురు కొంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు, సుంకాలు విధించడంతో పలు దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్భణం నానాటికీ పెరుగుతోంది.
ప్రపంచమొత్తం మాంద్యం ఉచ్చులో ఇరుక్కోనుందా? అనే భయాలు వెంటాడుతున్నాయి. ఇన్వెస్టర్ల భయం కూడా ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడానికి దోహదం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర, ఆర్థికపరంగా క్లిష్టమైన పరిస్థితులు నెలకొనడంతో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) భారత్‌కు శుభవార్త చెప్పింది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వేగంతో ముందుకు సాగుతోందని తెలిపింది.
తాజా 'వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్'విడుదల చేసిన ఐఎంఫ్ అందులో భారత వృద్ధి అంచనాలను మరోసారి సవరించింది. 2026- 2027 ఆర్థిక సంవత్సరాల్లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు స్తిరంగా 7.0 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్, సేవల రంగం విస్తరణ, నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక పురోగతికి ఊతమిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోనుందని సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది.మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ అది క్రమంగా బలహీనపడుతూ అసమానతలకు దారితీస్తోందని తెలిపింది.
వరల్డ్ గ్రోత్ రేటు 2026లో 3.1 శాతంగా, 2027లో 3.4 శాతంగా మాత్రమే నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.7 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ ముందస్తు హెచ్చరికలు చేసింది. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెరుగుతున్న చమురు ధరలు భయాందోళనలు,రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగిస్తున్నా.. భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఎంఐఎఫ్ అంచనా వేయడం భారత మార్కెట్లు,పెట్టుబడిదారులకు భారీ ఊరటను ఇచ్చే అవకాశం.


