తెలంగాణ

TG : బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. ఆన్‌లైన్‌లో క్లాసులు

రచన: Kumar••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు కురవడం లేదని, తద్వారా రాబోయే 8 నెలల కాలంలో గడ్డుపరస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.నీటితో పాటే విద్యుత్‌ను పొదుపుగా వాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు కురవడం లేదని, తద్వారా రాబోయే 8 నెలల కాలంలో గడ్డుపరస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.నీటితో పాటే విద్యుత్‌ను పొదుపుగా వాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, వేసవి రాకముందే రాష్ట్రంలో నీటి కష్టాలు మొదలవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే మైకుల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. వేసవి నీటి ఎద్దడి ఇప్పుడే మొదలైందని నీటిని వృథా చేయొద్దని, ఉల్లంఘిస్తే రూ.15 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేశారు.

బాసరలో నీటి కష్టాలు..

ఇదిలాఉండగా, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకునే బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కనీస తాగునీటి సౌకర్యం కూడా కరువైనట్టు సమాచారం. క్యాంపస్‌లో నీళ్లు లేని దుస్థితిలో విద్యార్థులకు నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ క్లాసులు ప్రకటించినట్టు తెలిసింది.దీంతో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని విద్యార్థులు వేలెత్తి చూపిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమకు ఏమి సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి సహకారం లేదని చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది. అంత పెద్ద విద్యాసంస్థలో కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించకపోవడం పాలకుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు విఫలం..

అయితే, కనీస తాగునీరు అందించలేని యంత్రాంగం క్యాంపస్‌లో విద్యా ప్రమాణాలను ఎలా కాపాడుతుంది? అని కొత్తగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు. ఎల్ నినో ప్రభావం ఉందని, ఈ ఏడాది వర్షాలు తక్కువగ పడతాయని, నీటి కష్టాలు ఎదురవుతాయని గత ఆరు నెలల నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతా తెలిసి కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారు? అసలు ప్రభుత్వ పర్యవేక్షణ ఏమైనట్లు? అని ప్రతిపక్షాలు, విద్యార్థుల పేరెంట్స్ నిలదీస్తున్నారు.

తరగతులు జరగాల్సిన క్యాంపస్‌ను కాదని నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే, విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం పడదా? అని అడుగుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఈ సమస్యలు పెద్దవా? ఇంతటి నీటి సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు? తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తక్షణమే ఈ నీటి సమస్యను పరిష్కరించి, క్యాంపస్‌లో సాధారణ తరగతులు తిరిగి ఎప్పుడు పునఃప్రారంభిస్తారో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

#basara IIIT#drinking water problem#Adilabad#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి