తెలంగాణ

HYD : సర్కారుపై పోరుబాట.. రేపటి నుంచే ‘ఈటల’ పాదయాత్ర!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

జవహర్ నగర్ డంపింగ్ యార్డును మరొక చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా మొద్ద నిద్ర వీడటం లేదని, అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ పాదయాత్రకు సంబంధించి టైమింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.

జవహర్ నగర్ డంపింగ్ యార్డును మరొక చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా మొద్ద నిద్ర వీడటం లేదని, అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ పాదయాత్రకు సంబంధించి టైమింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.

మంగళవారం ఉదయం 9 గంటలకు ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది.ముందుగా లక్ష్మీనారాయణ చెరువు సందర్శన, ఆ తర్వాత ⁠బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు.అనంతరం 5 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత మర్రిపల్లిగూడెం గ్రామంలో ఎంపీ ఈటల బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడ కూడా బాధితులతో సమావేశం కానున్నారు.

డంప్ యార్డు వలన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత చందుపట్లగూడ, NFC నగర్, బొక్కని గూడెం,ఘనపురం, అన్నోజిగూడ పాదయాత్ర కొనసాగనుంది.రాత్రికి అన్నోజిగూడలో బస చేస్తారు.మొత్తంగా 60 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని సమాచారం. ⁠మొదటి రోజు 14 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.

ఇదిలాఉండగా, పాదయాత్ర చేపట్టడానికి ముందు ఈటల రాజేందర్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధితులు మేధావులు, పర్యావరణ వేత్తలతో సమావేశం అయ్యారు. డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, దాని సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఎంపీ ఈటల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.‘జవహర్ నగర్‌లో ప్రాణం పోయినా పర్లేదు అని జీవిస్తున్నారు.

కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయడం లేదు.ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుంది.రాంకీ సీఎస్‌ఆర్‌ డబ్బులు ఇక్కడ తాగునీరు, రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. ఇంకో దగ్గర చెత్త వేయడానికి ప్రజలు ఒప్పుకోరు కాబట్టి జీరో పొల్యూషన్ టెక్నాలజీతో చెత్త డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. జవహర్ నగర్ చుట్టుపక్కల నరక కూపంగా మారింది. 30 కిలోమీటర్ల రేడియస్ లో కాలుష్యం ఇబ్బంది ఉంది. ఈ ఏరియా పిల్లలను స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందని స్కూల్స్ కూడా చేర్చుకోవడం లేదు’ సంచలన కామెంట్స్ చేశారు.

#mp etala rajender#march#towmarrow#jawaharnagar dumpyard#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి