సినిమా

Sai Pallavi: ఒక్క పాటతో పల్లవిపై విమర్శలన్నీ మాఫ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Sai Pallavi: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తెలుగులో నటించిన ఫిదా ఆమెకి స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల రాసుకున్న పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. ఇంత నేచురల్ పర్ఫార్మెన్స్ ఇంకో హీరోయిన్ చేయలేదనే ప్రశంసలు అందుకుంది.

Sai Pallavi: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తెలుగులో నటించిన ఫిదా ఆమెకి స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల రాసుకున్న పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. ఇంత నేచురల్ పర్ఫార్మెన్స్ ఇంకో హీరోయిన్ చేయలేదనే ప్రశంసలు అందుకుంది. కానీ, రామాయణ సినిమాకి మాత్రం మొదట్నుంచి ఒకటే విమర్శలు వచ్చాయి. అవన్నీ ఒకే ఒక్క పాటతో చెరిపేసింది.

బాలీవుడ్ దర్శక దిగ్గజం నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ రామాయణ. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ముంబైలో వేసిన అతి భారీ సెట్స్‌లో షూటింగ్ మొత్తం జరుపుతున్నారు. ఈ నవంబర్ మొదటి వారంలో రామాయణ నుంచి మొదటి భాగం విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా జరుపుతున్నారు.

అయితే, రామాయణ పార్ట్ 1 నుంచి పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ వదిలారు. వీటిలో ఒక్క సాయి పల్లవి మాత్రం అసలు సీత పాత్రకి సూటవలేదని అంతటా తెగ నెగిటివ్ ప్రచారం జరిగింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా పర్‌ఫెక్ట్‌గా సూటయ్యాడు కానీ, సీత పాత్రకి మాత్రం మేకర్స్ సరైన ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రావణ్‌గా యష్, శూర్పణఖ పాత్రలకి రకుల్ ఎంపిక కూడా పర్‌ఫెక్ట్ అన్నారు.

ఎటొచ్చి, పాత్రకి..కాస్ట్యూంస్ పరంగా సాయి పల్లవి రాంగ్ ఛాయిస్ అని బాగా విమర్శించారు. అయితే, విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో "రంగులే" అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఒక్క పాటతో ఇప్పటి వరకూ సాయి పల్లవిపై ఉన్న నెగిటివిటీ మొత్తం చెరిగిపోయింది. అంతగా, సీత పాత్రలో ఫిదా బ్యూటీ ఆకట్టుకొని విమర్శలను దాటుకొని ప్రశంసలను అందుకుంది. నిన్నామొన్నటి వరకూ రామాయణకి సాయి పల్లవి సరైన ఎంపిక కాదన్నవాళ్ళే.. ఇప్పుడు ఆమె అద్భుతంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఆమెకి మరింతగా పేరొచ్చే అవకాశాలున్నానడంలో సందేహమే లేదు.

#Sai Pallavi#Ramayana#RanbeerKapoor#Rangule Song
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి