National

PM Modi: సైబర్‌ ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలి.. ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరిక!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

PM Modi: యుద్ధాలు అంటే బోర్డర్ల దగ్గర తుపాకులు పట్టుకుని పోరాడటమే కాదని, సైబర్ ఉగ్రవాదులు మన ఆర్థిక వ్యవస్థ మీదే కన్నేశారని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ దొంగలు, సైబర్ ముఠాల నుంచి మన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

PM Modi: యుద్ధాలు అంటే బోర్డర్ల దగ్గర తుపాకులు పట్టుకుని పోరాడటమే కాదని, సైబర్ ఉగ్రవాదులు మన ఆర్థిక వ్యవస్థ మీదే కన్నేశారని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ దొంగలు, సైబర్ ముఠాల నుంచి మన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒడిశాలో రూ.169 కోట్లతో ఏర్పాటు చేసిన ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత అక్కడ మాట్లాడిన ప్రధాని, సరికొత్త తరహా యుద్ధాల గురించి సంచలన విషయాలు చెప్పారు.

"ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగడం లేదన్నది అందరికీ తెలుసు. ఒక దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఆ దేశ డబ్బు చలామణిని, బ్యాంకింగ్ వ్యవస్థను టార్గెట్ చేస్తే చాలు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఈ టైమ్‌లో మన బ్యాంకుల మీద సైబర్ ఉగ్రవాదులు గురిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ల నుంచి మన వ్యవస్థలను రక్షించుకోవాలి. పాత పద్ధతులు, పాత సాఫ్ట్‌వేర్లతో కూర్చుంటే కొత్తగా వచ్చే ఆన్‌లైన్ ముప్పులను ఆపలేం. ఆధునిక టెక్నాలజీ, గట్టి పర్యవేక్షణ మనకు చాలా అవసరం" అని ప్రధాని నొక్కి చెప్పారు.

ఇదే క్రమంలో గత కాంగ్రెస్ పాలన తీరుపైనా మోడీ మాట్లాడారు. అప్పట్లో బ్యాంకులు, లోన్లు అంటే కేవలం పెద్ద పెద్ద ధనికులకు, పలుకుబడి ఉన్నవాళ్లకే పరిమితమై ఉండేవని చెప్పారు. పేదలు, మధ్యతరగతి జనం, మహిళల వైపు బ్యాంకులు కన్నెత్తి కూడా చూసేవి కావన్నారు. 2014 తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు సామాన్యుడి చేతిలోకి కూడా ఏటీఎం కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ వచ్చేశాయని గుర్తుచేశారు. దేశ బ్యాంకింగ్ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతకంటే పకడ్బందీగా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

#PM Modi#Narendra Modi#Prime Minister Narendra Modi#PM Modi Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి