National

Anant Ambani: సైకిల్ తొక్కుతూ ఇంటింటికీ డెలివరీ ఇస్తున్న వ్యక్తి.. అనంత్‌ అంబానీ ఏం చేశాడంటే?

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Anant Ambani: రోజంతా సైకిల్ తొక్కుతూ ఆర్డర్లు డెలివరీ చేసే ఒక సామాన్యుడి జీవితంలో అస్సలు ఊహించని సంఘటన జరిగింది. వచ్చే అరకొర సంపాదనతో బైక్ కొనడం అసాధ్యం అనుకున్న వేళ.. అంబానీ ఇంటి నుంచి వచ్చిన ఒక సర్‌ప్రైజ్ అతడి కళ్లలో నీళ్లు తెప్పించింది.

Anant Ambani: రోజంతా సైకిల్ తొక్కుతూ ఆర్డర్లు డెలివరీ చేసే ఒక సామాన్యుడి జీవితంలో అస్సలు ఊహించని సంఘటన జరిగింది. వచ్చే అరకొర సంపాదనతో బైక్ కొనడం అసాధ్యం అనుకున్న వేళ.. అంబానీ ఇంటి నుంచి వచ్చిన ఒక సర్‌ప్రైజ్ అతడి కళ్లలో నీళ్లు తెప్పించింది. ఎండనక, వాననక సైకిల్‌పైనే కిలోమీటర్ల కొద్దీ తిరుగుతున్న ఆ డెలివరీ బాయ్‌ పరిస్థితి చూసి చలించిపోయిన అనంత్ అంబానీ, అతడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.

ముంబైకి చెందిన సుజీత్ అనే యువకుడు డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కనీసం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనే స్థోమత కూడా లేదు. దాంతో ప్రతిరోజూ సైకిల్‌ మీదే తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తుంటాడు. ఒకరోజు రోడ్డుపై అతడు సైకిల్ తొక్కుతూ వెళ్తుండగా హుస్సేన్ మన్సూరి అనే లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్ పలకరించాడు. "సైకిల్‌పై ఇంత కష్టపడే బదులు ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా బ్రదర్?" అని అడిగాడు. దానికి సుజీత్ బాధపడుతూ.. "వచ్చే కొద్దిపాటి జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, ఇక బైక్ ఎక్కడి నుంచి కొనగలను బ్రదర్.. ధరలన్నీ పెరిగిపోయాయి" అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ మాట విన్న హుస్సేన్.. "సరే నువ్వు ఈ డెలివరీ ముగించుకుని రా.. నీకో సర్‌ప్రైజ్ ఉంది" అని చెప్పి పంపించాడు.

డెలివరీ ముగించుకుని సుజీత్ తిరిగి రాగానే అతడి కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా కళ్లు విప్పి చూడగానే.. ఎదురుగా మెరిసిపోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపించింది. "ఇది నీ కోసం అనంత్ అంబానీ పంపించిన చిన్న గిఫ్ట్" అని చెప్పగానే సుజీత్‌కు మాటలు రాలేదు. ఆ ఊహించని సర్‌ప్రైజ్‌తో ఒక్కసారిగా గుండె బరువెక్కి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేశాడు సుజీత్. హుస్సేన్‌ను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘అనంత్ సేవా ఫౌండేషన్’ చేస్తున్న పనుల్లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సుజీత్‌కు అందజేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోను హుస్సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. కష్టాల్లో ఉన్న ఒక సామాన్యుడి ముఖంలో నవ్వులు పూయించిన అనంత్ అంబానీ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Anant Ambani#Anant Ambani Latest News#Anant Ambani Viral Video#Anant Ambani Gift#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి