సినిమా

Virosh Divorce Rumors: విజయ్-రష్మికనూ వదలని దుర్మార్గులు.. ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తార్రా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Virosh Divorce Rumors: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలంటే కొందరికి కేవలం ఒక ఆట వస్తువులా మారిపోయింది. వాళ్లు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే ఆసక్తి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వాళ్ల కాపురాలపై విషం కక్కే స్థాయికి దిగజారడం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది.

Virosh Divorce Rumors: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలంటే కొందరికి కేవలం ఒక ఆట వస్తువులా మారిపోయింది. వాళ్లు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే ఆసక్తి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వాళ్ల కాపురాలపై విషం కక్కే స్థాయికి దిగజారడం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. తాజాగా టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న నీచ ప్రచారం చూస్తే.. అసలు ఈ వికృత చేష్టలు ఎక్కడిదాకా వెళ్తాయి? ఇంకెంత మంది సెలబ్రిటీల జీవితాలతో ఇలా ఆడుకుంటారు? అనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే విడాకులంటూ పైశాచికానందం!

ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాదే ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు విజయ్, రష్మిక. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చి సందడి చేసింది. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా మొదలుపెట్టిన ఈ కొత్త జంటపై కొందరు అప్పుడే పడి ఏడవడం మొదలుపెట్టారు. పెళ్లై కనీసం ఏడాది కూడా గడవకముందే.. వీరిద్దరూ విడిపోతున్నారంటూ, విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కట్టుకథలు అల్లేస్తున్నారు. ఏ ఆధారం లేకుండా ఒక జంట బంధం గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ నెటిజన్లు సైతం నిలదీస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ బేస్ చేసుకుని బతుకులపై తీర్పులా?

విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను అన్‌ఫాలో చేశాడంటూ కొందరు పనిగట్టుకుని పోస్టులు పెట్టడం ఈ రచ్చకు ఆజ్యం పోసింది. అసలు వాస్తవం ఏంటంటే.. విజయ్ మొదటి నుంచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో అవ్వడు. తన ఫాలోయింగ్ లిస్ట్‌ను ఎప్పుడూ జీరోగానే మెయింటైన్ చేస్తాడు. అలాంటిది కేవలం రష్మికను మాత్రమే ప్రత్యేకంగా అన్‌ఫాలో చేసినట్లు ఫేక్ పోస్టులు సృష్టించి ప్రచారం చేశారు. ఫోన్‌లో ఉండే ఒక సోషల్ మీడియా యాప్ ఆధారంగా ఒకరి సంసారంపై తీర్పులు ఇచ్చే హక్కు మీకెవరిచ్చారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇంతటితో ఆగకుండా, ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్ దేవరకొండ సరదాగా చెప్పిన మాటలను కూడా కావాలని వక్రీకరించారు. రష్మిక తనను పెళ్లి చేసుకోమని దాదాపు ఏడాది పాటు వందసార్లు అడిగిందని, ఆ తర్వాతే తాను ఓకే చెప్పానని విజయ్ ఎంతో నవ్వుతూ పంచుకున్నారు. భార్యాభర్తల మధ్య ఉండే ఇలాంటి ముద్దు ముచ్చట్లను కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ.. విజయ్‌ను ‘రెడ్ ఫ్లాగ్’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రేమతో సాగే వ్యక్తిగత విషయాలను ఇంత దారుణంగా మార్చి రాక్షసానందం పొందడం ఏంటని సినీ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికైనా మారరా?

గతంలో సమంత - నాగచైతన్య మొదలుకుని ఎంతోమంది స్టార్ల విషయంలోనూ కొందరు ఇలాగే లేనిపోని కథనాలు అల్లి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన విజయ్ - రష్మికను కూడా వదలకుండా టార్గెట్ చేయడం దారుణమని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న వారిపై ఇలాంటి విష ప్రచారాలు చేయడం ఇకనైనా ఆపాలని, వ్యూస్ కోసం బంధాలను బజారున పడేసే పద్ధతి మానుకోవాలని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

#Virosh Divorce Rumors#Virosh#Vijay Rashmika#Vijay Deverakonda#Rashmika Mandanna#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి