Suriya: విభిన్నమైన నటనతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన సూర్య..హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. పాత్ర కోసం ఎలాంటి మేకోవర్ అయినా సిద్ధంగా ఉండే సూర్య..గజినీ, 24 లాంటి సినిమాలతో మంచి ప్రయోగాలు చేశాడు. సెవెంత్ సెన్స్, సింగం సిరీస్, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలు ఆయన కెరీర్లో మైల్‌స్టోన్స్. అయితే, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఇబ్బండి పడ్డాడు. మళ్ళీ ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. త్వరలో, సీన్ సినిమాతో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు.
ఏ హీరోకైనా మార్కెట్ బలంగా ఉండాలంటే సక్సెస్ ట్రాక్ చాలా కీలకం. రెండు, మూడు సినిమాలు గనక ఫ్లాప్ అయితే ఆ ప్రభావం తర్వాత సినిమాల మీదే కాదు, మార్కెట్ మీద కూడా గట్టిగా పడుతుంది. దాంతో, సినిమాల బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగదు. ఈ ప్రాబ్లంస్ సూర్య కూడా ఇటీవల ఫేస్ చేశాడు. కానీ, కరుప్పుతో హిట్ కొట్టి నిలబడ్డాడు. ఈ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ మన తెలుగు దర్శకుడితో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మరో భారీ విజయాన్నిచ్చింది.
ఈ మధ్య కాలంలో కోలీవుడ్ హీరోలతో మన తెలుగు మేకర్స్ ఇక్కడ స్ట్రైట్ సినిమాలు చేస్తూ మంచి కమర్షియల్ హిట్స్ ఇస్తున్నారు. సూర్య మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడంటే దానికి ముఖ్య కారణం మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి. సూర్య, గ్యారెంటీగా వెంకీకి చాలా రుణపడి ఉంటాడు. ఆ సినిమాను మన టాలీవుడ్ హీరోతో చేసి ఉంటే లెక్క ఇంకోలా ఉండేది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సూర్య కెరీర్లో ఒక మెమరబుల్ మూవీగా నిలిచింది అంటే ఆ క్రెడిట్ మాత్రం మన వెంకీ అట్లూరికే చెందాలి.
దీపావళికి సీన్:
ఒకే ఏడాది మూడు సినిమాలతో హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. ఈ రేర్ ఫీట్ ఎప్పుడో మన సీనియర్ హీరోలు అందుకున్నారు. మళ్ళీ, అలాంటి హ్యాట్రిక్ హిట్ కోసం సూర్య లేటెస్ట్ సినిమా సీన్‌తో రెడీ అవుతున్నాడు. జితు మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. సింగం సిరీస్ తరహాలోనే మరోసారి కాప్‌గా సూర్య నటిస్తున్నాడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ సీన్ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ దీపావళికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


