తెలంగాణ

Telangana Congress: రేవంత్ రెడ్డికి దక్కని సపోర్ట్.. పార్టీ నేతలపై గుస్సా

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు అధికార వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా, విడివిడిగా సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు అధికార వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా, విడివిడిగా సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, నిర్ణయాలను టార్గెట్ చేస్తూ ప్రతిరోజూ దాడి పెంచుతున్నాయి. అయితే, విపక్షాలు ఇంత తీవ్రంగా విరుచుకుపడుతున్నా.. అధికార పక్షం నుంచి అదే స్థాయిలో ధీటైన సమాధానం రాకపోవడం, తనపై మాత్రమే భారం పడుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కేబినెట్‌లో కొందరికే పరిమితమైన గళం

ప్రభుత్వంపై నాలుగు వైపుల నుంచి బాణాలు దూసుకొస్తున్న సమయంలో కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. మిగతా మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం రేవంత్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అధికారాన్ని అనుభవిస్తున్న నేతలు.. రాజకీయ సంక్షోభాలు, విపక్షాల దాడి సమయాల్లో ముఖ్యమంత్రికి అండగా నిలవకపోవడంపై సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. శాఖాపరంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చెప్పుకోవడంలోనూ, ప్రతిపక్షాల ఆరోపణలను ఎక్కడికక్కడే తిప్పికొట్టడంలోనూ కీలక నేతలు మీనమేషాలు లెక్కిస్తుండటాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు.

మంత్రులకు సీఎం ఘాటు క్లాస్.. ఇకనైనా మారుతారా?

సొంత పార్టీ నేతల నిస్తేజ వైఖరిపై రేవంత్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. "విపక్షాలు అబద్ధాలను కూడా పదే పదే ప్రచారం చేస్తుంటే.. చేతిలో వాస్తవాలు, ఆధారాలు పెట్టుకుని కూడా మౌనంగా కూర్చుంటారా?" అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై శాఖాపరమైన నిర్ణయాలపై మంత్రులే స్వయంగా మీడియా ముందుకు వచ్చి దూకుడుగా స్పందించాలని, ప్రతి అంశంపైనా ఎదురుదాడి చేయాల్సిందేనని రేవంత్ అల్టిమేటం జారీ చేశారట. ప్రభుత్వానికి లీడ్ ఇస్తున్న ముఖ్యమంత్రికి కేబినెట్ సహచరుల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ దక్కడం లేదన్న అంతర్గత అసంతృప్తి బయటపడటంతో.. రేవంత్ వార్నింగ్ తర్వాతైనా కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరు విప్పి దూకుడు పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

#Telangana Congress#Congress Party#Telangana Congress News#Telangana Congress Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి