సినిమా

Tollywood: ఈ సర్దుబాట్లు మంచిదే..లేదంటే మొత్తం మునుగుతారు!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Tollywood: చిన్న సినిమా, పెద్ద సినిమా..హీరో ఎవరైనా కంటెంట్ బలంగా ఉంటే ఆ సినిమానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మనది ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు హీరోల మధ్య పోటీ ఉండేది. హీరోను బట్టే సినిమా బిజినెస్ అయ్యేది. నిర్మాతకి లాభాలు వచ్చేవి. కానీ, రాజమౌళి దాన్ని మార్చేసి..దర్శకుడు పేరునే ముందు పరిగణలోకి తీసుకొనేలా కొత్త ట్రెండ్ సృష్ఠించాడు. ఈ మధ్యకాలంలో దర్శకుడెవరు అన్న దానిపైనే సినిమా బిజినెస్ జరుగుతోంది.

Tollywood: చిన్న సినిమా, పెద్ద సినిమా..హీరో ఎవరైనా కంటెంట్ బలంగా ఉంటే ఆ సినిమానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మనది ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు హీరోల మధ్య పోటీ ఉండేది. హీరోను బట్టే సినిమా బిజినెస్ అయ్యేది. నిర్మాతకి లాభాలు వచ్చేవి. కానీ, రాజమౌళి దాన్ని మార్చేసి..దర్శకుడు పేరునే ముందు పరిగణలోకి తీసుకొనేలా కొత్త ట్రెండ్ సృష్ఠించాడు. ఈ మధ్యకాలంలో దర్శకుడెవరు అన్న దానిపైనే సినిమా బిజినెస్ జరుగుతోంది. ఇలాంటి, సమయంలో సినిమాల మధ్య సర్దుబాటు కూడా చాలా కీలకంగా మారింది.

హీరోల మధ్య సఖ్యత:

ఈ మధ్య ఒక టాక్ బాగా నెట్టింట వైరల్ అవుతోంది. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాను వాస్తవానికి ఈ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ, అనూహ్యంగా..ఇంకా టాకీ పార్ట్ పూర్తి కాలేదన్న కారణంతో మార్చి 19,2027కి వాయిదా వేశారు. అయితే, స్పిరిట్ సినిమా కూడా ఇలాగే, వాయిదా పడింది. దీనికి కారణం బాలీవుడ్ హీరో రణ్‌బార్ కపూర్ అని తెలుస్తోంది. ఆయన, హింట్ ఇవ్వడం వల్లే స్పిరిట్ సినిమా తేదీని మార్చినట్టుగా సమాచారం.

దీపావళి కానుకగా రామాయణ పార్ట్ 1!

రణ్‌బీక్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిన రామాయణ ఈ దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ సీక్వెల్ లో యష్ రావణ్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే, పార్ట్ 2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నారని ముందుగానే ప్రకటించారు. అయితే, ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్టుగా రణ్‌బీర్ ముందుగానే ప్రభాస్‌కి హింట్ ఇవ్వడంతో..సందీప్ రెడ్డి..ఇదే దీపాళికి స్పిరిట్ సినిమాను రిలీజ్ చెయ్యాలని అక్టోబర్ 19ని లాక్ చేశారట.

హీరోల మధ్య మాత్రమే కాదు, దర్శకుల మధ్య కూడా ఇలాంటి అండర్‌స్టాండింగ్ ఉంటే ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాకుండా కనీసం రెండు వారాల వ్యవధి ఉంటే రెండు సినిమాలు లాభాలు చూడొచ్చునని..అలా, కాకుండా సమన్వయం లేకుండా రెండు చిత్రాలు బరిలో దిగితే, ఏదీ లాభపడదని ఓ ప్లాన్ ప్రకారమే విడుదల తేదీలని ప్రకటిస్తున్నారు. తాజాగా, వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం కోసం ఇట్లు అర్జున సినిమాను కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇలా, ఒకరికొకరు తేదీలను మార్చుకొని త్యాగం చేసుకుంటే మాత్రం అందరూ బావుంటారు. లేదంటే తీవ్ర నష్టాలతో మునగాల్సి వస్తుంది.

#Ramayana#Ranbeer Kapoor#Spirit#Prabhas#Sandeep Reddy Vanga
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి