తెలంగాణ

TG :ఫ్లెక్సీల చించివేత.. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఫీవర్!

రచన: Kumar••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చూస్తే భయం వేస్తోందని అందుకే ఎక్కడ కనిపించినా వెంటనే తొలగించడం, చించివేయడం చేస్తున్నారని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో అధికార పార్టీ మీద రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రతరం అవుతోందని,అందుకే వారికి గులాబీ రంగు చూస్తే గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చూస్తే భయం వేస్తోందని అందుకే ఎక్కడ కనిపించినా వెంటనే తొలగించడం, చించివేయడం చేస్తున్నారని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో అధికార పార్టీ మీద రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రతరం అవుతోందని,అందుకే వారికి గులాబీ రంగు చూస్తే గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేరవేర్చకుండా ఇంకా గత ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ మీద నెపం వేయడం ఏంటని తప్పుపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తుందని, ఇంకా గత సర్కారు చేసిన తప్పులను ఎత్తి చూపే బదులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అభివృద్ధి చేసి చూపించాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్ నినో వలన వర్షాలు పడలేదని, సాగు నీరు ఇవ్వడం కుదరదని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టే బదులు.. పంతానికి పోకుండా వెంటనే కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు ప్రారంభించాలని పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఆ ప్రాజెక్టును పడావు పెట్టారని ఆరోపిస్తున్నారు.

ఇదిలాఉండగా, నగరంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు, జీహెచ్ఎంసీ తొలగించడంపైనా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ అంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ​ఖైరతాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలు చూసి కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు పుడుతోందని, ​ఖైరతాబాద్ సీనియర్ నేత జిబ్రాన్ బీఆర్‌ఎస్‌లో చేరికను చూసి అధికార పార్టీ ఓర్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫ్లెక్సీల ధ్వంసం అందుకునా?

​జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, విరించి హాస్పిటల్, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​అర్ధరాత్రి వేళ జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ​ఫ్లెక్సీలు తొలగింపుపై ప్రశ్నిస్తే జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమాధానం దాటవేస్తున్నారని, ​పై అధికారుల ఆదేశాలంటూ చెబుతున్నారని వెల్లడించారు.

​కాంగ్రెస్ ఫ్లెక్సీలకు రక్షణ కల్పిస్తూ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలపై దాడులా? అంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ​ఫ్లెక్సీలు చింపేస్తే ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణను ఆపగలరా ముఖ్యమంత్రి? అంటూ ప్రశ్నిస్తున్నారు.​అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని అన్నారు. ​ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ చేరికల జోరును అడ్డుకునేందుకే ఈ దిగజారుడు చర్యలంటూ నేతల ధ్వజమెత్తారు.​ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫ్లెక్సీలను చించివేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

#BRS flexies#congress#GHMC#removed#hyderabad#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి