టాప్ న్యూస్

TG : వ్యాపారుల దందా.. ప్రైవేటు గోదాముల్లో బియ్యం అక్రమ నిల్వలు!

రచన: Kumar••6 నిమిషాల పఠనం

రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయని అడిగితే సరఫరా లేదని, ఎల్ నినో ప్రభావం అని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం బియ్యం ధరల పెరుగుదల మీద ఏ మాత్రం స్పందించడం లేదు. సామాన్యుడి వంటిల్లు తగలబడిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్కారు చేతగానితనాన్ని సూచిస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయని అడిగితే సరఫరా లేదని, ఎల్ నినో ప్రభావం అని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం బియ్యం ధరల పెరుగుదల మీద ఏ మాత్రం స్పందించడం లేదు. సామాన్యుడి వంటిల్లు తగలబడిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్కారు చేతగానితనాన్ని సూచిస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు పీడీఎస్ రైస్ టన్నుల కొద్దీ పక్కదారి పడుతున్నా అడ్డుకోలేని సర్కార్ బియ్యం రేట్లు పెరగడానికి ఎల్ నినో కారణమని చెబుతోంది.

సాగు నీరు ఇవ్వడం చేతగాక యాసంగికి వరి వేయొద్దని చెబుతోంది. అన్నదాతలను భయపెడుతోంది.గత ప్రభుత్వంలో వందలకొద్ది టన్నుల పీడీఎస్ రైస్‌ను రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారు. ప్రభుత్వానికి రూ. వేల కోట్లు నష్టాన్ని మిగిలించారు. తీరా చూస్తే బియ్యం పోయాయి, మిల్లర్లు తప్పించుకున్నారు. సర్కారు మాత్రం వారి మీద కేసు పెట్టి చేతులు దులుపుకుంది.రాష్ట్రంలో సన్నబియ్యాన్ని ప్రజలకు రేవంత్ సర్కార్ పంపిణీ చేస్తోంది. మూడు నెలల కోటా అయిపోయింది. వచ్చేనెలలో సన్నబియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉన్నది.

ప్రజలకు సన్న బియ్యం పంపణీ ఎలా?

ఈసారి రాష్ట్రంలో వరి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి కోటా వస్తే గానీ సన్నబియ్యం పంపిణీ సాధ్యం అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సీజన్ వరికి హాలిడే ప్రకటిస్తే నెలా నెలా ప్రజలకు సన్నిబియ్యం ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కొందరు దళారులు, వ్యాపారులు కలిసి కావాలనే ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్ నినో ప్రభావం ఉండటం, వరి దిగుబడి తగ్గడం, వచ్చే సీజన్ పంటవేయొద్దని రేవంత్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించంతో దాన్ని దళారులు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ముందస్తుగా ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని స్టోర్ చేస్తున్నారు.

సర్కారు మాటే వరమైందా?

ఓవైపు ఎల్‌నినో, మరోవైపు సాగు నీరు ఇవ్వడం పాజిబుల్ కాదని.. యాసంగిలో వరి వేయొద్దని సర్కారు చెప్పడం దళారులు, వ్యాపారులకు వరంలా మారింది. పెద్దమొత్తంలో బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నారు.ఎవరికీ తెలియకుండా గుట్టుగా ప్రయివేటు గోదాముల్లో వాటిని దాస్తున్నట్టు తెలిసింది.రాష్ట్రంలో బియ్యం దందా చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

కొందరు వ్యాపారులు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.అదంతా బ్లాక్ మార్కెట్ చేయడంతో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. మూడు నెలల్లోనే 30–40 శాతానికి పైగా ధరలు పెరిగాయి.ప్రస్తుతం కిలో సన్నబియ్యం ధర రూ.60 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. అయితే, గోదాముల్లో లక్షల టన్నుల బియ్యం నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కొరత వస్తుందనే అంచనాలతో ముందుగానే వ్యాపారులు నిల్వలు పెంచుతున్నారు.

భారీగా అక్రమ నిల్వలు..

హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌ ప్రాంతంలోని ప్రైవేట్‌ గోదాముల్లో భారీగా బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం. బియ్యం నిల్వలు, అమ్మకాల వివరాల నమోదులో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తెలిసింది. షాపుల్లో ధరల పట్టికలు ప్రదర్శించకుండానే విక్రయాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ధరల పెంపుతో సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.అయితే, ఈ బియ్యం ధరల పెరుగుదలతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని, కేవలం వ్యాపారులు, దళారులకు మాత్రమే లబ్ది పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శలుఉన్నాయి.

#Congress government#Elnino#PDS rice#blockmarket#price hike#telangana#illegally stored#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి