సినిమా

Srinu Vaitla: సంక్రాంతి బరిలో జార్జి క్రిష్ తట్టుకోగలడా? ఇంత రిస్క్ అవసరమా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Srinu Vaitla: 2027, సంక్రాంతికి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్, ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి మహాకాళి, అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకున్నాయి. ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో గత కొన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో లేని శ్రీను వైట్ల..శర్వాతో చేస్తోన్న జార్జి క్రిష్ సినిమాతో బరిలోకి దిగుతున్నాడు. ఇది రిస్క్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

2027, జనవరి 8న మహాకాళి:

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రూపొందుతోన్న మహాకాళి సినిమా 2027, సంక్రాంతి బరిలో అందరికంటే ముందే దిగుతోంది. జనవరి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే, ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. హిట్ మెషిన్ అని రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న జనవరి 12 విడుదల సినిమా అదే తేదీకి రిలీజ్ అవుతోంది. ఇది, వెంకీ-కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్-కృతీ శెట్టిల కాంబోలో వస్తోంది. దీనిపై, భారీ అంచనాలున్నాయి.

అనిల్ రావిపూడి కెరీర్‌లో వస్తోన్న 10వ సినిమా కావడం విశేషం. కాబట్టి, అనిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోడు. హిట్ గ్యారెంటీ అని ఆల్రెడీ మేకర్స్ ఫిక్సైయ్యారు.

ఇక, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు కూడా ఇదే జనవరి 12కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాయికి చాలా కీలకం. హిట్ తప్పనిసరి అనేలా మేకర్స్ రూపొందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో రూపొందుతోన్న కాకా సినిమాను జనరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో వచ్చి మెగాస్టార్ భారీ హిట్ అందుకున్నారు. 2027, సంక్రాంతికి అదే బలమైన నమ్మకంతో వస్తున్నారు. ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీతో రాబోతుండటం పెద్ద రిస్కే అని చెప్పాలి. అయితే, ఇప్పటికే, బిజినెస్ కూడా జరిగిపోయింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ జార్జ్ క్రిష్ పోస్ట్ పోన్ చేయడం కుదరదు.

అయితే, నవంబర్ 12న సంపత్ నంది దర్శకత్వంలో శర్వా నటించిన భోగి సినిమా సక్సెస్ మీద చాలావరకూ జార్జ్ క్రిష్ మూవీపై బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం భోగీ కంటెంట్ అదిరిపోయింది. ఒకవేళ జనాలకి గనక ఈ సినిమా కనెక్ట్ అయితే, పక్కా సంపత్ నంది-శర్వాలకి భారీ సక్సెస్ ఖాయం. భోగి హిట్ అయితే, జార్జ్ క్రిష్ సేఫ్ ప్రాజెక్ట్ అవడానికి ఆస్కారం బాగానే ఉంటుంది. చూడాలి, మరి ఏం జరుగుతుందో.

#George Krish#Sharwanand#Sreenu Vaitla#Manasa Varanasi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి