సినిమా

Dil Raju: దిల్ రాజు గేమ్ స్టార్ట్?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Dil Raju: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్స్‌గా ఓ వెలుగు వెలిగాడు దిల్ రాజు. అయితే, వరుస ఫ్లాపుల వల్ల నిర్మాణంలో, డిస్ట్రిబ్యూషన్‌లో ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. ఈ గ్యాప్‌లో మైత్రీ వారు, సితార, ఏషియన్ వాళ్ళు బాగా పుంజుకున్నారు. ఎక్కువగా వరుస హిట్స్ కొడుతుంది అంటే మైత్రీ వారే. డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మైత్రీ దూసుకుపోతోంది. దీంతో, పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న దిల్ రాజు స్ట్రాటజీ ప్లాన్ చేశాడు.

మళ్ళీ తన మార్క్ మేకింగ్‌తో సినిమాలను నిర్మిస్తున్నాడు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా భారీ ప్రాజెక్ట్స్‌ను బ్లాక్ చేసుకుంటున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాతో ఆర్ధికంగా బాగా నలిగిపోయిన రాజు గారు..కాస్త తేరుకోవడానికి సమయం పట్టింది. మళ్ళీ, తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. మొన్నామధ్య తీసుకున్న టాక్సిక్ సినిమా నష్టపోయినా కూడా యష్ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికే అగ్రిమెంట్ చేసుకున్నారు.

రామాయణ, మైసా చిత్రాలతో దిల్ రాజు ఒడ్డుకు చేరుకుంటాడా?

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఈ మధ్యకాలంలో తీవ్రంగా నష్టాలను చూశాడు దిల్ రాజు. అందుకే, మళ్ళీ కెరీర్ ప్రారంభంలో ఎలా అయితే, బడ్జెట్ కంట్రోల్‌తో సినిమాలు తీశాడో అదే ఫాలో అవుతున్నాడు. తెలుగులో, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమాను తీస్తున్నాడు. స్టార్ హీరోలను అనుకున్న దిల్ రాజు..ఫైనల్‌గా దేవిని ఫిక్స్ చేసుకున్నాడు. అలాగే, విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు తెలుగు ప్రాజెక్ట్స్‌తో పాటు హిందీలో సల్మాన్ ఖాన్-నయనతార జంటగా వంశీ పైడిపల్లి సినిమాను నిర్మిస్తున్నాడు.

హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న రామాయణ రెండు భాగాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. అయితే, టాక్సిక్ మాదిరిగా అగ్రిమెంట్ జరిగిందా లేదా అన్నది తెలియదు. ఒకవేళ సినిమా లాస్ అయితే రికవరీ ఉంటుందా లేదా అనేది రివీల్ చేయలేదు. ఇప్పుడు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోన్న మైసా సినిమాను నైజాం, వైజాగ్ లలో దిల్ రాజు పంపిణీ హక్కులను దక్కించుకున్నాడు. రామాయణ, మైసా గనక హిట్ సాధిస్తే..దాదాపుగా దిల్ రాజు ఒడ్డుకు చేరుకున్నట్టే. మరి, ఈ రెండు సినిమాల ఫలితం ఎలా వస్తుందో చూడాలి.

#Dil Raju#Ramayana#Mysa#Rashmika Mandanna#Yellamma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి