తెలంగాణ

TG : కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. కారెక్కిన NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగుతోందని పేర్కొంటూ NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగుతోందని పేర్కొంటూ NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు రోజు ఆయన సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

గత మూడేళ్లుగా కాంగ్రెస్ పాలనలో యువకులకు, నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి నాయకుల పెత్తనం పెరిగిందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జెండాలు మోశామని, కానీ గత మూడేండ్లుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు.

సొంత పార్టీ, ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ యువతకు అభివృద్ధి కావాలని డిమాండ్ చేశారు. తమ యువతకు సూట్ అయ్యే నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. అందుకే భారీ సంఖ్యలో యువత అందరం కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరాలని నిశ్చయించుకున్నామని NSUI మాజీ స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే నిన్న మధ్యాహ్నం ప్రకటించారు.

ఇదిలాఉండగా, నవంబర్ 1వ తేదీన ఆదిలాబాద్‌లో జరగనున్న భారీ 'రైతు గర్జన' సభలో కేటీఆర్ సమక్షంలో ఆయన మరికొంత మంది అనుచరులతో కలిసి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏండ్లుగా జెండాలు మోసిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అధికార పార్టీ కిందిస్థాయి కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ లీడర్లు తమ తర్వాత వారి వారసులకు పదవులు ఇప్పించుకుంటున్నారని, పార్టీ జెండాలు మోసే తమకు ఎప్పుడు అధికారం దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పదవుల్లోనూ తమకు న్యాయం దక్కడం లేదని వాపోయినట్టు సమాచారం.

#former NSUI leader bhargav#joined#BRS#KTR#politics#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి