సినిమా

Prabhas-Fauzi: ఇలా పోల్చుకోవడం సినిమాను చంపినట్టేగా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Prabhas-Fauzi: హను రాఘవపూడి అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఆయన తీసిన 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', 'పడి పడి లేచె మనసు' 'సీతారామం' చిత్రాలే. మొదటి సినిమా కథ నచ్చి స్వయంగా రాజమౌళీనే 'అందాల రాక్షసి' సినిమాను ప్రమోట్ చేశాడు. 'అందాల రాక్షసి' నుంచి 'పడి పడి లేచె మనసు' సినిమాల వరకూ ఒకెత్తైతే, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లతో చేసిన సీతారామం ఒక్కటీ ఒకెత్తు.

Prabhas-Fauzi: హను రాఘవపూడి అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఆయన తీసిన 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', 'పడి పడి లేచె మనసు' 'సీతారామం' చిత్రాలే. మొదటి సినిమా కథ నచ్చి స్వయంగా రాజమౌళీనే 'అందాల రాక్షసి' సినిమాను ప్రమోట్ చేశాడు. 'అందాల రాక్షసి' నుంచి 'పడి పడి లేచె మనసు' సినిమాల వరకూ ఒకెత్తైతే, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లతో చేసిన సీతారామం ఒక్కటీ ఒకెత్తు. అయితే, ప్రభాస్‌తో హను చేస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ ని సీతారామంతో పోల్చి చూడటం ఒకరకంగా సినిమాను రిలీజ్‌కి ముందే చంపేసినట్టు అని నెటిజన్స్ ఫీలవుతున్నారు.

సీతారామం సినిమాతో హను రాఘపూడికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది..ఇందులో అసలు అనుమానే లేదు. మణి రత్నం తర్వాత, మళ్ళీ అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే సన్నివేశాలు, సంగీతం, నటీనటుల ఎంపిక, సినిమాలో వారి నటన.. ఇలా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే హను సినిమాలతోనే. ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మనకున్న అతికొద్ది మంది దర్శకుల్లో హను రాఘపూడి..ఆయన తీసిన సినిమాలే అందరి మనసుల్లో మెదులుతాయి.

ముఖ్యంగా, సీతారామం సినిమా గురించి మాట్లాడుకుంటే, దుల్కర్ కి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. వాస్తవానికి, ఈ కథ ముందు మన టాలీవుడ్ లో చాలామంది హీరోలకి చెప్పాడట హను. కానీ, వాళ్ళకి నచ్చక సింపుల్‌గా రిజెక్ట్ చేశారట. దాంతో, ఈ కథ దుల్కర్ దగ్గరికి వెళ్ళింది. అలా, దుల్కర్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇదంతా, బాగానే ఉంది. అప్పటి సీతారామం సినిమాతో ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమాను పోల్చడం ముమ్మాటికీ తప్పే.

ఎందుకంటే, ఒక దర్శకుడు కథను రాసుకున్న తర్వాత, హీరోతో సెట్స్‌పైకి తీసుకు వచ్చాక..ప్రతీ కోణంలో ఇంకో సినిమాతో కంపేర్ చేయడం..ప్రేక్షకుల్లో రక రకాల ఆలోచనలను కలిగించడమే. సినిమా మీద ఆసక్తి తగ్గడానికి ఇదే, ప్రధాన కారణం అవుతుంది. దీనివల్ల, ఈ సినిమా.. ఆ సినిమాలాగే ఉంటుందట..అనే నెగిటివ్ థాట్స్ వచ్చి..జనాలలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఒకవేళ, ప్రేక్షకుల ముందుకు వచ్చాక అన్నీ వర్గాల వారికి కథ-కథనాలు నచ్చకపోతే..ఆ సినిమా ఫ్లాప్ గా మిగులుతుంది. ఇప్పుడు, ఫౌజీ సినిమాపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతుంది. అందుకే, ప్రభాస్ అభిమానులు మాత్రం సీతారామంతో ఎందుకు ఫౌజీని పోల్చుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు.

#Prabhas#Fauzi#Hanu Raghavapudi#Imanvi#Sitaramam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి