క్రైమ్

HYD : హైదరాబాద్‌లో ‘గన్’ కలకలం.. పారిపోయిన బార్ కస్టమర్లు

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి మరోసారి గన్ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తాగేసి బిల్లు చెల్లించే విషయంలో తోటి మిత్రులతో గొడవకు దిగినట్టు సమాచారం. తాను బిల్లు కట్టనని, మీరే కట్టాలని గొడవకు దిగడంతో బౌన్సర్లు వచ్చి వారిని కిందకు పంపించివేశారు.

హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి మరోసారి గన్ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తాగేసి బిల్లు చెల్లించే విషయంలో తోటి మిత్రులతో గొడవకు దిగినట్టు సమాచారం. తాను బిల్లు కట్టనని, మీరే కట్టాలని గొడవకు దిగడంతో బౌన్సర్లు వచ్చి వారిని కిందకు పంపించివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన కారులోని గన్ తీసుకొని వచ్చి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే కాల్చేస్తానని ఫ్రెండ్స్, బౌన్సర్లను బెదిరించినట్టు సమాచారం.

వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో హైడ్రామా నడిచింది. కట్టిన బార్ బిల్లు డబ్బు ఇవ్వాలని ఓ వ్యక్తి గన్ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫుల్లుగా మద్యం సేవించిన అనంతరం బిల్లు చెల్లించే విషయంలో తన ఫ్రెండ్స్‌తో మహమ్మద్ షానవాజ్ (24) గొడవకు దిగాడు.గొడవ పెద్దది కాకుండా వెంటనే బౌన్సర్లు ఎంట్రీ ఇచ్చి వారిని కిందకు పంపించివేశారు.

ఆగ్రహంతో ఊగిపోయిన షానవాజ్.. తన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లి రివాల్వర్ తీసుకొచ్చాడు. మళ్లీ రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో బౌన్సర్లు అడ్డుకున్నారు. సెల్లార్‌లో కస్టమర్లు, బౌన్సర్లను రివాల్వర్ చూపించి బెదిరింపులకు యత్నించాడు. బార్‌లో కట్టిన బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కాల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడున్న కస్టమర్లు వెంటనే పరుగులు తీశారు.దీంతో బార్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకోవడంతో పాటు థార్ వాహనాన్ని కూడా స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో అర్ధరాత్రి బార్ సిబ్బంది, వాహనదారులు కూడా భయాందోళనకు గురైనట్టు సమాచారం.

#Bar and retaureant#Gun#warning#customers#crime#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి