January-12 Vidudhala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. అనిల్ మార్క్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ కి చేరుకుంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ప్రస్తుతం, ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ ప్రకారం.. నవంబర్ రెండో వారం నుంచి చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీని కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారు. ఇందులోనే ఈ సినిమా క్లైమాక్స్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇక, ఈ క్లైమాక్స్ కోసం కామెడీతో రాసిన స్పెషల్ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నాడు అనిల్. అంతేకాదు, ఈ క్లైమాక్స్ నుంచి వచ్చే కామెడీ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకువెళుతుందని చిత్రబృందం ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే, దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్.. వెంకటేష్ టైమింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకూ, వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఇలాంటి టైమింగ్‌తో జనరేట్ అయిన కామెడీకి థియేటర్స్ దద్దరిల్లాయి. ఈ సారి జనవరి 12 విడుదలలో వీరిద్దకి కళ్యాణ్‌రామ్ కూడా తోడవడంతో కొత్త తరహా కామెడీకి ప్లాన్ చేశారు. ఇక, వెంకీ-కళ్యాణ్‌రామ్ లతో పాటు హీరోయిన్స్ కీర్తి సురేష్-కృతీల గ్లామర్ మరో రేంజ్ అని చెప్తున్నారు.
ఈ నలుగురికి అనిల్ రావిపూడి మార్క్ పంచ్‌లు తోడైతే థియేటర్లలో నవ్వులతో రీసౌండ్ గ్యారెంటీ. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి వరుసగా 9 బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు, జనవరి 12 వుడుదలతో 10వ బ్లాక్ బస్టర్కి గట్టిగా సిద్ధమవుతున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


