సినిమా

Ram Charan: ఆ రెండు రామ్ చరణ్ డ్రీమ్ రోల్స్?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Ram Charan: రామ్ చరణ్..మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరుతలా ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతో అటు డాన్స్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. వారసుడి ఎంట్రీ అనేది మొదటి సినిమా వరకే తప్ప, ఆ తర్వాత ఏ నటుడైనా తన సొంత టాలెంట్‌తో నిరూపించుకొని నిలబడాల్సిందే. చరణ్ ఈ విషయంలో ప్రతీ సినిమాను తన మొదటి సినిమాగా చేస్తున్నాడు.

Ram Charan: రామ్ చరణ్..మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరుతలా ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతో అటు డాన్స్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. వారసుడి ఎంట్రీ అనేది మొదటి సినిమా వరకే తప్ప, ఆ తర్వాత ఏ నటుడైనా తన సొంత టాలెంట్‌తో నిరూపించుకొని నిలబడాల్సిందే. చరణ్ ఈ విషయంలో ప్రతీ సినిమాను తన మొదటి సినిమాగా చేస్తున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు చరణ్‌కి రెండు డ్రీమ్ రోల్స్ ఉన్నాయట. అవే, ఆర్మీ జవాన్..గ్యాంగ్‌స్టర్. ఈ పాత్రలను ఆధారంగా చేసుకొని పాన్ ఇండియా లెవల్‌లో స్టోరీ రెడీ చేయమని దర్శకులకి సూచిస్తున్నాడట మెగా పవర్ స్టార్.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ ట్రాక్ తప్పిందా?

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్‌టిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ ఈ ఇద్దరికీ పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్, మార్కెట్‌ను తెచ్చింది. కానీ, ఇద్దరు మళ్ళీ ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ పోషించిన రామరాజు పాత్రతో భారీగా పేరొచ్చింది. ఈ పాత్ర కోసం చరణ్ చాలా శ్రమించాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవర్ ఫుల్ రోల్ అంటే చరణ్, దానికోసం ఎంతో కఠినంగా తయారవుతాడు. రంగస్థలం సినిమాలో పోషించిన చిట్టిబాబు పాత్ర మరో ఉదాహరణ.

ప్రస్తుతం, రామ్ చరణ్..తన 17వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. మరోసారి సుకుమార్-మైత్రీ వారితో కలిసి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే, అంచనాలున్నాయి. ఎక్కువభాగం విదేశాలలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే, సుకుమార్-చరణ్ లొకేషన్స్ కూడా ఫైనల్ చేసి వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే, ఈ సినిమాను అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. ఏడాదిలోపే రిలీజ్ అయ్యేలా చరణ్-సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్ లైనప్‌లో సందీప్ రెడ్డి, ప్రశాంత్ నీల్:

రామ్ చరణ్ లైనప్ కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. సుకుమార్ సినిమా తర్వాత.. సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరితోనే చరణ్ నెక్స్ట్ సినిమాలుండే అవకాశాలున్నాయి. అలాగే, కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా చరణ్‌కి కథలు చెప్పినట్టుగా ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆయన చేయని గ్యాంగ్‌స్టర్, ఆర్మీ జవాన్ పాత్రలు సందీప్ రెడ్డి, ప్రశాంత్ నిల్ల్ అయితే బాగా డిజైన్ చేయగలరు. అలాంటి, పాత్రలతో కథ చేసి చరణ్‌ని మెప్పిస్తే మాత్రం వీరికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. మరి, రామ్ చరణ్ డ్రీమ్ రోల్స్ తో అప్రోచ్ అయ్యేదెవరో చూడాలి.

#Ram Charan#Ram Charan Dream Roles#Sukumar#Sandeep reddy Vanga#Prashanth Neel
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి