సినిమా

Telugu Cinema: బ్యాక్ గ్రౌండ్ లేని నటులపై విషపు జర్నలిజం..

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

elugu Cinema: తెలుగు సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్లు లేకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకుని వచ్చే నటీనటులపై కొందరు యూట్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయంగా మారింది. వెనుక పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ ఉన్న హీరోల ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడే కొందరు సోకాల్డ్ జర్నలిస్టులు.. ఎలాంటి సినీ నేపథ్యం లేని యువ నటులు కనిపిస్తే మాత్రం తమలోని అహంకారాన్ని,

Telugu Cinema: తెలుగు సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్లు లేకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకుని వచ్చే నటీనటులపై కొందరు యూట్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయంగా మారింది. వెనుక పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ ఉన్న హీరోల ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడే కొందరు సోకాల్డ్ జర్నలిస్టులు.. ఎలాంటి సినీ నేపథ్యం లేని యువ నటులు కనిపిస్తే మాత్రం తమలోని అహంకారాన్ని, పైత్యాన్ని మొత్తం బయటకు తీస్తున్నారు. చిన్న ఆర్టిస్టులను చులకనగా చూడటం, వ్యక్తిగతంగా అవమానించడం ఇప్పుడు యూట్యూబ్ జర్నలిజంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

‘వీడేం చేస్తాడులే’ అనే చులకన భావం

గతంలో ఓ సీనియర్ కమెడియన్‌ను "అద్దంలో ముఖం చూసుకున్నావా" అని ఒకరంటే.. మరో వర్ధమాన నటుడిని "నువ్వు హీరో మెటీరియలేనా" అని ఇంకొకరు ఎగతాళి చేశాడు. రీసెంట్‌గా యంగ్ హీరో మౌళి విషయంలో జరిగిన రచ్చే ఇందుకు తాజా ఉదాహరణ. "మౌళి ఎవరు? ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత అతన్ని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఇక్కడ మౌళి, బాలి ఏమీ ఉండవు" అంటూ ఓ యాంకర్ బహిరంగంగానే తేలిగ్గా మాట్లాడేశాడు. సొంతంగా కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతున్న ఒక నటుడిపై ఇంత వెటకారం, విషం ఎందుకు? వెనుక అండదండలు లేవు కాబట్టి.. వీడు బచ్చాగాడు, మనల్ని ఏం చేయలేడన్న ధీమాతోనే కదా ఇంతలా రెచ్చిపోతున్నారు? అదే ఒక స్టార్ హీరో కొడుకు గురించో, బడా ఫ్యామిలీ హీరో గురించో ఇలాంటి మాటలు మాట్లాడే దమ్ము వీళ్లకు ఉంటుందా?

రాకపోతే కెరీర్ నాశనం చేస్తామంటూ బెదిరింపులు

ఈ విష సంస్కృతి కేవలం మాటలతోనే ఆగడం లేదు. ఒకసారి ఒంట్లో బాగోక ఇంటర్వ్యూకు రాలేనని చెప్పినందుకు.. "నువ్వు రాకపోతే నీ నెక్స్ట్ సినిమాకు నెగెటివ్ చేసి తొక్కిపారేస్తాం" అని మౌళిని ఓ ఛానెల్ వారు బెదిరించారంటే పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తమ ప్రోగ్రామ్స్ కోసం కొత్త నటుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం, బెదిరించి లొంగదీసుకోవడం పచ్చి బ్లాక్‌మెయిలింగ్. ఎదురు తిరిగితే ఎక్కడ మీడియా కక్ష కట్టి కెరీర్‌ను నాశనం చేస్తుందోనన్న భయంతో, తిట్టినా భరిస్తూ కుమిలిపోవడం చిన్న ఆర్టిస్టుల వంతవుతోంది.

కొత్త టాలెంట్‌కు అండగా నిలిచేదెవరు?

సినిమా అంటే కేవలం నాలుగు కుటుంబాల సొత్తు కాదు. ఎందరో యువతీ యువకులు ఎన్నో కలలతో, స్వయంకృషితో ఇండస్ట్రీకి వస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాల్సింది పోయి, బ్యాక్‌గ్రౌండ్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఇలా పబ్లిక్‌గా హేళన చేస్తుంటే ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆర్టిస్టుల హక్కుల కోసం ఏర్పాటైన 'మా' లాంటి అసోసియేషన్లు ఇలాంటి విషపు జర్నలిజాన్ని ఎందుకు నిలదీయడం లేదు? వెనుక ఎవరూ లేని ఆర్టిస్టులకు వ్యవస్థ అండగా నిలవకపోతే, ప్రతిభ ఉన్న కొత్త వాళ్లు పరిశ్రమలోకి అడుగుపెట్టే ధైర్యం ఎలా చేస్తారు?

#Bank Loan Tips#Bank Loan Tips Telugu#Bank Loan Mistakes#Common Loan Mistakes#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి