తెలంగాణ

Congress : మేడిగడ్డ టూర్ ఒక జాలీట్రిప్.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

రచన: Kumar••5 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కకర పరిస్థితులను అడ్వాంటెజ్‌గా తీసుకుని, ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని దానం నాగేందర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కకర పరిస్థితులను అడ్వాంటెజ్‌గా తీసుకుని, ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని దానం నాగేందర్ మండిపడ్డారు.ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల వెనుక కేవలం రాజకీయ స్వార్థం తప్పా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేపట్టిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ పర్యటన కేవలం ఒక ‘జాలీ ట్రిప్’ మాత్రమేనని దానం నాగేందర్ అభివర్ణించారు.రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం బీఆర్ఎస్ నేతలకు తెలీదా? అని ప్రశ్నించారు.

ఎల్‌నినోను అడ్డుంపెట్టుకుని అనవసర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర వాసుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని దానం నాగేందర్ స్పష్టంచేశారు. 2027 జనవరి నాటికి హైదరాబాద్ మహా నగరానికి అదనంగా మరో 5 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు.

భవిష్యత్ అవసరాలు, మహానగర ప్రయోజనాల గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుకుపోతుందని అలాంటప్పుడు సాగు నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. సాగు కోసం నీరిస్తే ఫ్యూచర్‌లో తాగు నీటికి కటకట ఏర్పడుతుందని, అప్పుడు ఏం చేస్తారని నిలదీశారు.

ఇదిలాఉండగా, మరో విపక్ష పార్టీ బీజేపీ మీద కూడా దానం నాగేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రాల్లో ఓట్లను అక్రమంగా తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 1వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకిస్తున్న ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించబోయే నిరసన కోసం సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు భారీగా తరలివెళ్లనున్న విషయం తెలిసిందే.

#Congress#danam nagender#hyderabad#BRS#ELnino#water problem#SIR#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి