సినిమా

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Pavan Sadineni: తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న అతికొద్దిమంది దర్శకుల్లో పవన్ సాదినేని ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం "ఆకాశంలో ఒక తార". అద్భుతమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌తో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. సినిమాకి సంబందించిన ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు పవన్ సాదినేని. ఈ సినిమా నవంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

చాలా అరుదుగా వచ్చే సినిమా:

ఫక్తు కమర్షియల్ సినిమాను తీసి ప్రేక్షకుల ముందు పెడుతున్న దర్శకుల లెక్క వేరు. వీళ్ళంతా ఒక ఫార్ములా ప్రకారం సినిమాను తీయడానికి అలవాటు పడ్డారు. కరెక్ట్‌గా చెప్పాలంటే దర్శకుడు తేజ అన్నట్టు..ఒక డైలో ఉండిపోతారు. కథ కాదు ముఖ్యం..సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటే సరిపోతాయనే ఒక అపనమ్మకంతో ఉంటారు. అందుకే, ఒక ఇంట్రో సాంగ్..కొన్ని కామెడీ సీన్స్, ఒక ఫైట్..క్లైమాక్స్ ముందు చిన్న ట్విస్ట్..సెకండాఫ్ లో చెప్పడానికి కథ లేక, ఒక కామెడీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఏదోలా ఎంటర్‌టైన్ చేయాలని అసలు ట్రాక్ తప్పుతున్నారు.

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..

అందుకే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం బడ్జెట్ సినిమాలు ఒకపట్టాన సక్సెస్ అవవు. సినిమాకి ముందు ఉండే హైప్..ఒక్క షో తర్వాత డిజాల్వ్ అవుతుంది. సినిమా బాగోలేదని ప్రేక్షకులు అంటే..వాళ్ళకి కథ అర్థం కాలేదని..అందుకే, మా సినిమా ఆడలేదని సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. కానీ, మనం ఎంత బలమైన కథ చెప్పామూ..అది ప్రేక్షకుడిని ఆకట్టుకుందా..ఆలోచింపజేసిందా..ఎమోషనల్ అయ్యాడా..ఇలాంటి అంశాలను పట్టించుకోరు.

కథను మాత్రమే నమ్మే దర్శకుడు:

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..

పవన్ సాదినేని కథను మాత్రమే బలంగా నమ్మి..ఆ కథకి ఏ హీరో సరిగ్గా సరిపోతాడు..అని మార్కెట్ పరంగా లెక్కలతో సినిమాను ఎంతో అభిరుచితో చేస్తున్నారు. ఇలాంటి, దర్శకులను నుంచి సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ, అది ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అలాంటి, బలమైన కథ-కథనాలతో వస్తున్న సినిమానే "ఆకాశంలో ఒక తార".

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..

క్రేజీ కాస్టింగ్:

పవన్ సాదినేని రాసుకున్న కథలో పాత్రలను ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఎంచుకుంటారు. తాజా చిత్రం "ఆకాశంలో ఒక తార" కి కాస్టింగ్ మేజర్ ప్లస్ కాబోతోంది. హీరోగా దుల్కర్ సల్మాన్, హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి నటిస్తున్నారు. కీలక పాత్రల్లో శ్రుతి హాసన్, రుహానీ శర్మ నటిస్తున్నారు. ఈ నాలుగు పాత్రలను అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను నవంబర్ 20న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలోనూ విడుదల చేయబోతున్నారు. లైట్‌బాక్స్ మీడియా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో దర్శకుడిగా పవన్ సాదినేని మరో స్థాయికి చేరుకోవడం గ్యారెంటీ.

#Pavan Sadineni#Aakasamlo Oka Tara#Dulquer Salmaan#Satvika Veeravalli#Shruti Haasan#Ruhani Sharma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి