హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని దుండగులు కారులో ఎక్కించుకుని వెళ్లినట్టు సమాచారం. అనంతరం నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించకున్నట్టు తెలిసింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాఫ్ట్‌వేర్ శ్యామ్ నాగ్ శనివారం రాత్రి తన ఫ్రెండ్ భార్గవ్‌రాజ్‌తో కలిసి గోపన్‌పల్లిలో మద్యం తాగారు.భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లగా కారులో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధితుడి ఫ్రెండ్ భార్గవ్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
వెంటనే డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి శ్యామ్ నాగ్‌ను గుర్తించారు. అనంతరం ఆయన్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులు నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లారన్న శ్యామ్ నాగ్ పోలీసులకు వెల్లడించారు. అక్కడ తనను కత్తితో బెదిరించి పలు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని చెప్పాడు. అయితే, నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
ఈ మేరకు కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది. కిడ్నాప్ చేసిన దుండగులకు, బాధిత టెకీని మధ్య ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఆ దుండగులు ఎవరు? సంతకాలు ఎందుకు పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల శ్యామ్ నాగ్ ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా? ఆర్థిక లావాదేవీల సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్నకోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది.


