Aadarsha Kutumbam: కథ-కథనం బలంగా ఉన్న సినిమాలే ఇప్పుడు ప్రేక్షకాధరణ పొందుతున్నాయి. అంతేతప్ప కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం తీస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. కథ బావుంటే పాటలు, కామెడీ లేకపోయినా ఎమోషన్స్ మీద ఆడేస్తుంది. లేదా, మాస్ హీరోల కోసం కాకుండా చిన్న నటీనటులతోనైనా క్యూట్ లవ్ స్టోరీని తీసినా ఆడుతుంది. అవే, నిర్మాతలను లాభాల్లోకి తెస్తున్నాయి. కానీ, త్వరలో రాబోతున్న ఆదర్శకుటుంబం ఫార్ములా ప్రకారమే రూపొందించారట.
సినిమా రిలీజ్‌కి ముందే చర్చలా?
వెంకటేష్ నటించిన ఆదర్శకుటుంబం అక్టోబర్ 30న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే, రెండుసార్లు వాయిదా పడిన ఆదర్శకుటుంబం మీద కాస్త నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. కానీ, ప్రమోషనల్ కంటెంట్‌తో అది కాస్త పాజిటివ్‌గా మారింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో కొత్తగా చర్చలు మొదలయ్యాయి.
ఫస్టాఫ్ ఓకే..సెకండాఫ్ సో సో?
అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆదర్శకుటుంబం గురించి జరుగుతున్న చర్చ..ఫస్టాఫ్ కామెడీతో బాగానే లాక్కొచ్చారు. ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది. కానీ, సెకండాఫ్ అంతగా లేదట..ఎక్కువగా యాక్షన్..సస్పెన్స్ మీదే సాగుతుంది..పెద్దగా ఇంపాక్ట్ లేదట..అంటూ వార్తల్లో ప్రచారం చేస్తున్నారు. సినిమా రిలీజైయ్యాక రావాల్సిన ఈ చర్చ..ఇప్పుడు రావడం అంటే కావాలనే సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్థమవుతోంది.
అదేంటోగానీ గురూజీ సినిమాలకే ఇలా జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ సమయంలో దాదాపు ఫస్టాఫ్ మొత్తం యూట్యూబ్‌లో వచ్చేసింది. దాంతో, మేకర్స్ కాస్త కంగారు పడ్డారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుందా..హిట్ అవుతుందా..అలా జరగకపోతే వందల కోట్ల నష్టం అని. కానీ, ఈ సినిమా 100 కోట్ల మార్క్ దాటి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరి, మంచి అంచనాలతో వస్తోన్న ఆదర్శ కుటుంబం ఇంత నెగిటివిటీ మధ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


