సినిమా

Kangana Ranaut: కంగనాకి తెలుగు సినిమా సూటవదు..మళ్ళీ ఎలా ట్రై చేస్తున్నారు స్వామీ?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Kangana Ranaut: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగుతున్న చాలామంది మన టాలీవుడ్‌లో ఖంగుతిన్నవాళ్ళే. ఇక్కడ, భాష తెలియక స్క్రీన్ మీద ఎలాంటి హావాభావలను చూపించాలో అర్థంకాక పాత్ర గాలో తేలిపోయింది. అలాంటి, నటులు ఒకటి రెండు సినిమాలతోనే సర్దేసుకున్నారు. అలాంటి, వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు.

Kangana Ranaut: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగుతున్న చాలామంది మన టాలీవుడ్‌లో ఖంగుతిన్నవాళ్ళే. ఇక్కడ, భాష తెలియక స్క్రీన్ మీద ఎలాంటి హావాభావలను చూపించాలో అర్థంకాక పాత్ర గాలో తేలిపోయింది. అలాంటి, నటులు ఒకటి రెండు సినిమాలతోనే సర్దేసుకున్నారు. అలాంటి, వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు. 17ఏళ్ళ క్రితం బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్లాపైంది. మళ్ళీ, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

పోకిరి మిస్సైనా బుజ్జిగాడుతో ఛాన్స్:

పూరి జగన్నాధ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ పోకిరి. పవన్ కళ్యాణ్ కాదన్న కథను రవితేజకి, ఆయనకి కుదరక మహేష్ బాబుకి చెప్పి సినిమా తీసిన పూరి, భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో కంగనాను టాలీవుడ్‌కి పరిచయం చేయాలనుకున్నాడు పూరి. కానీ, డేట్స్ కుదరక ఇలియానా వచ్చింది. పోకిరి తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ఇల్లీ బేబి.

ప్రభాస్‌తో ఛాన్స్:

కంగనాను పూరి వదల్లేదు. డార్లింగ్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో మళ్ళీ ట్రై చేసి టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ, ప్రభాస్ కటౌట్‌కి కంగనా అస్సలు సరిపోలేదు. పైగా, భాష సమస్య కారణంగా ఆమె ఏడుస్తుందో నవ్వుతుందో అర్థం కాని పరిస్థితి. బుజ్జిగాడు సినిమాకి మేజర్ మైనస్ కంగనానే అని అప్పట్లో చెప్పుకున్నారు. మళ్ళీ, తెలుగులో ఈ క్వీన్‌కి ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ, టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు మన టాలీవుడ్‌కి తీసుకువచ్చే ప్రయత్నాలను చేస్తున్నాడట.

రవిబాబు కథలన్నీ సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ జానర్స్‌లో ఎంతో విభిన్నంగా ఉంటాయి. మరోసారి, ఆయన ఓ హర్రర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో, కంగనా రనౌత్ నటిస్తున్నట్టుగా తాజా సమాచారం. అంతేకాదు, ఇప్పటికే చాలా సైలెంట్‌గా టాకీ పార్ట్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. అయితే, ఇందులో నిజమెంత ఉందో గానీ, రవిబాబు సినిమాకి కంగనా సూటవదనే మాట వాస్తవం. ఆమెకి, బాలీవుడ్ మీద ఉన్న పట్టు టాలీవుడ్ మీద లేదు. హిందీలో హీరోను మించిన క్రేజ్ కంగనాది. అక్కడ, హీరో లేకుండా కంగనా పేరుతో బిజినెస్ జరుగుతంది. కానీ, ఇక్కడ అలా కాదు. మరి, రవిబాబు ఛాయిస్ ఎందుకు ఇలా మారిందో.

#Kangana Ranaut#Ravibabu#Bollywood#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి